Nee seye meemdugaaga ne nemtadaananu

నీ చేయే మీఁదుగాక నే నెంతదానను
Language

(॥పల్లవి॥)
నీ చేయే మీఁదుగాక నే నెంతదానను
చేచేత నింకానేమి చెక్కునొక్కేవయ్యా

(॥నీచే॥)
సాదవు నీవై తేను సారె గోళ్లే వాఁడి
యేదెస నెవ్వరినని యేమందును
సాదించ నీతోడిపొందు చలువయు వేఁడీ నాయ
వేద దీర నింకనేమి వేఁడుకొనేమయ్యా

(॥నిచే॥)
మాట నీది చక్కనైతే మతకాలు వంకరలు
చీటికి మాటికి నెంత చింతింతును
చాటున నీ గుణములు చప్పనానుప్పనా నాయ
బూటకాన నీవెంత బుజ్జగించేవయ్యా

(॥నీచే॥)
దైవికము నీదైతే తగవులు మానుషాలు
యీవల నలమేల్మంగ నేమి చెప్పేను
శ్రీవేంకటేశ నీచేఁతలు చిగురూఁ జేఁగా
యీవేళఁ గూడితి వింకానేమి చెప్పేవయ్యా

(||pallavi||)
nī seye mīm̐dugāga ne nĕṁtadānanu
seseda niṁkānemi sĕkkunŏkkevayyā

(||nīse||)
sādavu nīvai tenu sārĕ goḽle vām̐ḍi
yedĕsa nĕvvarinani yemaṁdunu
sādiṁcha nīdoḍibŏṁdu saluvayu vem̐ḍī nāya
veda dīra niṁkanemi vem̐ḍugŏnemayyā

(||nise||)
māḍa nīdi sakkanaide madagālu vaṁkaralu
sīḍigi māḍigi nĕṁta siṁtiṁtunu
sāḍuna nī guṇamulu sappanānuppanā nāya
būḍagāna nīvĕṁta bujjagiṁchevayyā

(||nīse||)
daivigamu nīdaide tagavulu mānuṣhālu
yīvala nalamelmaṁga nemi sĕppenu
śhrīveṁkaḍeśha nīsem̐talu sigurūm̐ jem̐gā
yīveḽam̐ gūḍidi viṁkānemi sĕppevayyā