Nee semtale ivi neevela sigguvadevu

నీ చేఁతలే ఇవి నీవేల సిగ్గువడేవు
Language

(॥పల్లవి॥)
నీ చేఁతలే ఇవి నీవేల సిగ్గువడేవు
చేచేత వలపులు చిమ్మి రేఁచకుండునా

(॥॥)
తగ నీతనికి నీవు తతిగొని చెప్పఁగాను
చిగురుమోవికి వాడుచెందకుండునా
పగటుసరసమునఁ బై పైఁ బెనఁగఁగాను
వెగటుఁ జన్నులు వెల్లవిరి గాకవుండునా

(॥॥)
నడుమ నూరకె నీవు నవ్వులు నవ్వఁ గాను
జడియని నీ కొప్పు జారకుండునా
వొడివట్టి తీసి పతి నొద్దికిఁ బిలువఁగాను
వెడవెడ పోఁకముడి వీడకుండునా

(॥॥)
ముందె శ్రీ వేంకటెశు మోవి చవిగొనఁగాను
కందువమర్మము కరఁగక వుండునా
సందులేక కాఁగిటిలో సతములై వుండఁగాను
మందలించి వేడుకలు మరిగించకుండునా

(||pallavi||)
nī sem̐tale ivi nīvela sigguvaḍevu
seseda valabulu simmi rem̐saguṁḍunā

(||||)
taga nīdanigi nīvu tadigŏni sĕppam̐gānu
sigurumovigi vāḍusĕṁdaguṁḍunā
pagaḍusarasamunam̐ bai paim̐ bĕnam̐gam̐gānu
vĕgaḍum̐ jannulu vĕllaviri gāgavuṁḍunā

(||||)
naḍuma nūragĕ nīvu navvulu navvam̐ gānu
jaḍiyani nī kŏppu jāraguṁḍunā
vŏḍivaṭṭi tīsi padi nŏddigim̐ biluvam̐gānu
vĕḍavĕḍa pom̐kamuḍi vīḍaguṁḍunā

(||||)
muṁdĕ śhrī veṁkaḍĕśhu movi savigŏnam̐gānu
kaṁduvamarmamu karam̐gaga vuṁḍunā
saṁdulega kām̐giḍilo sadamulai vuṁḍam̐gānu
maṁdaliṁchi veḍugalu marigiṁchaguṁḍunā