నీ చేతిలో వార మిదే నిలుపఁగ నిలిచితి మింతే
(॥పల్లవి॥)
నీ చేతిలో వార మిదే నిలుపఁగ నిలిచితి మింతే
చూచేటి చూపులవాండ్లు సోకించకువయ్యా
(॥నీచేతి॥)
పిడికెఁడు నడుమున నడఁగుచు బెరసేటివారము నే మిదె
కొడిదెఁడు గన్నులవారము కోపం బేడదయా
బెడిదపు నీ సుద్దులకే పెంచితి మిదె మా వీనులు
బడలిక దోఁచి మము నిఁక బడలించకు వయ్యా
(॥నీచేతి॥)
జుట్టెఁడు పాదంబులనే సాంపగు మా నడవ ళ్లివె
పట్టెఁడు గుచములవారము పంతం బేడదయా
నెట్టన శిరసుఁన బెంచితిని మోహము నా తురుమున
నట్టనడుమ నూరక నను నవ్వించకు వయ్యా
(॥నీచేతి॥)
సందిటిలోపలనే నీ సరసపు కౌఁగిటివారము
జందెపుఁ బయ్యెద దొలఁగెను చల మిఁక నేడదయా
యిందునే శ్రీవేంకటేశ్వర యిటు ననుఁ గూడితి విదివో
కెందమ్మిచేతుల సారెకు గిలిగించకు వయ్యా
(||pallavi||)
nī sedilo vāra mide nilubam̐ga nilisidi miṁte
sūseḍi sūbulavāṁḍlu sogiṁchaguvayyā
(||nīsedi||)
piḍigĕm̐ḍu naḍumuna naḍam̐gusu bĕraseḍivāramu ne midĕ
kŏḍidĕm̐ḍu gannulavāramu kobaṁ beḍadayā
bĕḍidabu nī suddulage pĕṁchidi midĕ mā vīnulu
baḍaliga dom̐si mamu nim̐ka baḍaliṁchagu vayyā
(||nīsedi||)
juṭṭĕm̐ḍu pādaṁbulane sāṁpagu mā naḍava ḽlivĕ
paṭṭĕm̐ḍu gusamulavāramu paṁtaṁ beḍadayā
nĕṭṭana śhirasum̐na bĕṁchidini mohamu nā turumuna
naṭṭanaḍuma nūraga nanu navviṁchagu vayyā
(||nīsedi||)
saṁdiḍilobalane nī sarasabu kaum̐giḍivāramu
jaṁdĕbum̐ bayyĕda dŏlam̐gĕnu sala mim̐ka neḍadayā
yiṁdune śhrīveṁkaḍeśhvara yiḍu nanum̐ gūḍidi vidivo
kĕṁdammisedula sārĕgu giligiṁchagu vayyā