Nee samdamulu vere naa samdamulu vere

నీ చందములు వేరె నా చందములు వేరె
Language

(॥పల్లవి॥)
నీ చందములు వేరె నా చందములు వేరె
ఏచి నీకు నాకుఁ బొందు లెట్టు గూడెరా

(॥నీచం॥)
కమ్మిననీకన్ను లిట్టె కడుఁదెల్లఁగాఁ గాను
ఇమ్ముల నాకనుఁగొన లెఱ్ఱఁబారెరా
సమ్మతించి నీమేను చల్లనైనందులకె
కమ్మర నామేను యిట్టె కాఁకరేఁగెరా

(॥నీచం॥)
పూచిననీమేన నిట్టె పులుక లుబ్బఁగ జూచి
లాచి నీవుండి నాదేహలత వాడెరా
వీచుల నీసెలవుల వెన్నెలలు గాయఁగాను
యీచాయ నాకోపముల యెండగాసెరా

(॥నీచం॥)
అంతలో శ్రీవేంకటేశ ఆదరించి కూడఁగాను
వింతగా నాతురుమును వెడవీడెరా
చింతలనీమతి నీవే చిమ్మిరేఁగి మఱవఁగా
యింతట నాతమకము లెచ్చరించీరా

(||pallavi||)
nī saṁdamulu verĕ nā saṁdamulu verĕ
esi nīgu nāgum̐ bŏṁdu lĕṭṭu gūḍĕrā

(||nīsaṁ||)
kamminanīgannu liṭṭĕ kaḍum̐dĕllam̐gām̐ gānu
immula nāganum̐gŏna lĕṭram̐bārĕrā
sammadiṁchi nīmenu sallanainaṁdulagĕ
kammara nāmenu yiṭṭĕ kām̐karem̐gĕrā

(||nīsaṁ||)
pūsinanīmena niṭṭĕ puluga lubbam̐ga jūsi
lāsi nīvuṁḍi nādehalada vāḍĕrā
vīsula nīsĕlavula vĕnnĕlalu gāyam̐gānu
yīsāya nāgobamula yĕṁḍagāsĕrā

(||nīsaṁ||)
aṁtalo śhrīveṁkaḍeśha ādariṁchi kūḍam̐gānu
viṁtagā nādurumunu vĕḍavīḍĕrā
siṁtalanīmadi nīve simmirem̐gi maṟavam̐gā
yiṁtaḍa nādamagamu lĕchchariṁchīrā