Nee saaja mitlaane neevadda numdamgaanu

నీ సాజ మిట్లానే నీవద్ద నుండఁగాను
Language

(॥పల్లవి॥)
నీ సాజ మిట్లానే నీవద్ద నుండఁగాను
వేసాలెల్ల నా ముందర వేమారుఁ జూపేవు

(॥నీసా॥)
వరసకువచ్చినాపె వద్దఁ గాచుకుండఁగాను
యెరవుల యాఁటదాని నేల తెచ్చేవు
సరవితో సొమ్ము నీమైచందమై వుండఁగాను
పరుల సొమ్ముల కెంత బాఁతిపడేవు

(॥నీసా॥)
ముందు పెండ్లాడినాపె నీమొగము చూడఁగాను
కందువనున్నాఁటదానికడ చూచేవు
చిందుచు గందము నీజిగిమేన నుండఁగాను
అందుకోలుగందానకు నాసపడేవు

(॥నీసా॥)
చేకొనూడిగపుటాపె చెవిలో విన్నవించఁగా
ఆకడాఁటదానిమాట లాలకించేవు
యీకడ శ్రీవేంకటేశ యిటు నన్ను నేలితివి
సేకరించి యిపుడుగా చెలరేఁగేవు

(||pallavi||)
nī sāja miṭlāne nīvadda nuṁḍam̐gānu
vesālĕlla nā muṁdara vemārum̐ jūbevu

(||nīsā||)
varasaguvachchinābĕ vaddam̐ gāsuguṁḍam̐gānu
yĕravula yām̐ṭadāni nela tĕchchevu
saravido sŏmmu nīmaisaṁdamai vuṁḍam̐gānu
parula sŏmmula kĕṁta bām̐tibaḍevu

(||nīsā||)
muṁdu pĕṁḍlāḍinābĕ nīmŏgamu sūḍam̐gānu
kaṁduvanunnām̐ṭadānigaḍa sūsevu
siṁdusu gaṁdamu nījigimena nuṁḍam̐gānu
aṁdugolugaṁdānagu nāsabaḍevu

(||nīsā||)
segŏnūḍigabuḍābĕ sĕvilo vinnaviṁcham̐gā
āgaḍām̐ṭadānimāḍa lālagiṁchevu
yīgaḍa śhrīveṁkaḍeśha yiḍu nannu nelidivi
segariṁchi yibuḍugā sĕlarem̐gevu