Nee rasana limteshaaya nivveragela padevu

నీ రచన లింతేశాయ నివ్వెరగేల పడేవు
Language

(॥పల్లవి॥)
నీ రచన లింతేశాయ నివ్వెరగేల పడేవు
పౌరకామినులు నిన్నుఁ బంగించితేఁ దప్పా

(॥నీర॥)
కోరి కోరి పిలువఁగ గుట్టెల్లా బయిటఁబడె
సారె సారె నవ్వఁగాను చలివాసెను
మారుకొని మాటాడఁగ మందెమేలమాయ నేఁడు
తేరి చూచి ఆకె నిన్నుఁ దిట్టకుండునా

(॥నీర॥)
చెక్కులు నీవు నొక్కఁగా సిగ్గులెల్లాఁ దొలఁగెను
చక్కఁగ నీవు మెచ్చఁగ చండిపడెను
దక్కి నీవండనుండఁగ తనకు వెఱవు దీరె
తక్కక పాదాన నిన్నుఁ దాఁకించక మానునా

(॥నీర॥)
నీవు గాఁగిలించుకోఁగా నిండురాజసము గప్పె
కైవసము గాంగాను కాఁకదేరెను
యీవల నలమేల్మంగ యిట్టె వురమెక్కించఁగ
శ్రీవేంకటేశ నీసేవ సేయవలదా

(||pallavi||)
nī rasana liṁteśhāya nivvĕragela paḍevu
pauragāminulu ninnum̐ baṁgiṁchidem̐ dappā

(||nīra||)
kori kori piluvam̐ga guṭṭĕllā bayiḍam̐baḍĕ
sārĕ sārĕ navvam̐gānu salivāsĕnu
mārugŏni māḍāḍam̐ga maṁdĕmelamāya nem̐ḍu
teri sūsi āgĕ ninnum̐ diṭṭaguṁḍunā

(||nīra||)
sĕkkulu nīvu nŏkkam̐gā siggulĕllām̐ dŏlam̐gĕnu
sakkam̐ga nīvu mĕchcham̐ga saṁḍibaḍĕnu
dakki nīvaṁḍanuṁḍam̐ga tanagu vĕṟavu dīrĕ
takkaga pādāna ninnum̐ dām̐kiṁchaga mānunā

(||nīra||)
nīvu gām̐giliṁchugom̐gā niṁḍurājasamu gappĕ
kaivasamu gāṁgānu kām̐kaderĕnu
yīvala nalamelmaṁga yiṭṭĕ vuramĕkkiṁcham̐ga
śhrīveṁkaḍeśha nīseva seyavaladā