నీ రమణునికొలఁది నీ వెఱుఁగుదు
(॥పల్లవి॥)
నీ రమణునికొలఁది నీ వెఱుఁగుదు
గారవించి మట్టుతోనే కలయు నీ వపుడు
(॥నీర॥)
చెలియరో నీ వతనిచెక్కు నొక్కఁబోయేవు
ములువాఁడికొనగోరు మోచీఁజుమ్మీ
వులివచ్చివలపుల వుప్పొలి కినుమడైతే
ములుగ ములుగ నట్టె వేఁగౌనపుడు
(॥నీర॥)
సరుసఁ గూచుండి నీవు సారె సారెఁ బెనఁగేవు
వొరసి నీచనుఁగొండ లొత్తీఁజుమ్మీ
తిరమై పాసి కలి ముదిరి మెడిదెయైతే
ధరలో పండ్లువులిసి తమిరేఁగు నపుడు
(॥నీర॥)
మోవిచవులకుఁ జొక్కి ముందుముందె కొసరేవు
సోవలుగఁ గొంత పల్లుసోఁకీఁజుమ్మీ
శ్రీవేంకటేశుఁడు గూడె చిగురె చేఁగలైతే
వేలువేలు చేఁతలెల్లా వెలవెట్టు నపుడు
(||pallavi||)
nī ramaṇunigŏlam̐di nī vĕṟum̐gudu
gāraviṁchi maṭṭudone kalayu nī vabuḍu
(||nīra||)
sĕliyaro nī vadanisĕkku nŏkkam̐boyevu
muluvām̐ḍigŏnagoru mosīm̐jummī
vulivachchivalabula vuppŏli kinumaḍaide
muluga muluga naṭṭĕ vem̐gaunabuḍu
(||nīra||)
sarusam̐ gūsuṁḍi nīvu sārĕ sārĕm̐ bĕnam̐gevu
vŏrasi nīsanum̐gŏṁḍa lŏttīm̐jummī
tiramai pāsi kali mudiri mĕḍidĕyaide
dharalo paṁḍluvulisi tamirem̐gu nabuḍu
(||nīra||)
movisavulagum̐ jŏkki muṁdumuṁdĕ kŏsarevu
sovalugam̐ gŏṁta pallusom̐kīm̐jummī
śhrīveṁkaḍeśhum̐ḍu gūḍĕ sigurĕ sem̐galaide
veluvelu sem̐talĕllā vĕlavĕṭṭu nabuḍu