నీ రమణు డిదె వచ్చీ నెరి నీ విరహ మేలే
(॥పల్లవి॥)
నీ రమణు డిదె వచ్చీ నెరి నీ విరహ మేలే
కూరిమి గలుగుచోటఁ గొసరేలే
(॥నీరమణు॥)
పులకమోసులు గాని పువ్వుబాణములు గావు
పలుమారు చెలి యేల భ్రమసేవే
కలయ నిట్టూర్పు గానిఁకడు జల్లగాలి గాదు
అలికి అలికి యేల అలసేవే
(॥నీరమణు॥)
మక్కుఁ జెమటలు గాని మదనరసాలు గావు
వెక్కసమై యింతి యేల వెఱచేవే
చెక్కులకాఁకలు గాని చిత్తజుమంటలు గావు
వొక్కమాటే యింత యేల వులికేవే
(॥నీరమణు॥)
కూడినరతులు గాని గుంపెనవాదులు గావు
యేడ కేడ వో చెలి యెంచి చూచేవే
యీడనే శ్రీవేంకటేశుఁ డింతలోనే నిన్నుఁ గూడె
వేడుకల నింతలోనే విఱ్ఱవీ గేవే
(||pallavi||)
nī ramaṇu ḍidĕ vachchī nĕri nī viraha mele
kūrimi galugusoḍam̐ gŏsarele
(||nīramaṇu||)
pulagamosulu gāni puvvubāṇamulu gāvu
palumāru sĕli yela bhramaseve
kalaya niṭṭūrbu gānim̐kaḍu jallagāli gādu
aligi aligi yela alaseve
(||nīramaṇu||)
makkum̐ jĕmaḍalu gāni madanarasālu gāvu
vĕkkasamai yiṁti yela vĕṟaseve
sĕkkulagām̐kalu gāni sittajumaṁṭalu gāvu
vŏkkamāḍe yiṁta yela vuligeve
(||nīramaṇu||)
kūḍinaradulu gāni guṁpĕnavādulu gāvu
yeḍa keḍa vo sĕli yĕṁchi sūseve
yīḍane śhrīveṁkaḍeśhum̐ ḍiṁtalone ninnum̐ gūḍĕ
veḍugala niṁtalone viṭravī geve