నీ రాజసముతోడ నెమ్మది నుందువుగాక
(॥పల్లవి॥)
నీ రాజసముతోడ నెమ్మది నుందువుగాక
కూరవండి కసవేరి(రే?) గుణ మింకా నేఁటికి
(॥నీరా॥)
కోపగించఁజెల్లునా కొంగువట్టితివి నీవు
ఆపని; కేమైనాఁ జెలి యనుఁగాక
వోపననఁజెల్లునా వూఁకొంటివి పైఁడికత-
కీపాటివాఁడవు ముందేల నవ్వితివి
(॥నీరా॥)
వేగిరించఁజెల్లునా వెలఁదిఁ బిల్చినవాఁడ-
వాగతి నాకెచిత్తమది నీభాగ్యము గాక
రాగిదేర్చ కంత నీవు రాలుదింటా మలిగండ్లా
వేగి లేరి వచ్చి నీవు వేసాలే సేసేవు
(॥నీరా॥)
వంతమాడఁజెల్లునా పడఁతికాఁగిటఁ జిక్కి
చెంతల నాకె యేమైనాఁ జేసుఁగాక
వింతగా శ్రీవేంకటేశ వేసితే వేయిరూపులాయ.
మంతనపురతులు నీమగువకును నీకును
(||pallavi||)
nī rājasamudoḍa nĕmmadi nuṁduvugāga
kūravaṁḍi kasaveri(re?) guṇa miṁkā nem̐ṭigi
(||nīrā||)
kobagiṁcham̐jĕllunā kŏṁguvaṭṭidivi nīvu
ābani; kemainām̐ jĕli yanum̐gāga
vobananam̐jĕllunā vūm̐kŏṁṭivi paim̐ḍigada-
kībāḍivām̐ḍavu muṁdela navvidivi
(||nīrā||)
vegiriṁcham̐jĕllunā vĕlam̐dim̐ bilsinavām̐ḍa-
vāgadi nāgĕsittamadi nībhāgyamu gāga
rāgidersa kaṁta nīvu rāludiṁṭā maligaṁḍlā
vegi leri vachchi nīvu vesāle sesevu
(||nīrā||)
vaṁtamāḍam̐jĕllunā paḍam̐tigām̐giḍam̐ jikki
sĕṁtala nāgĕ yemainām̐ jesum̐gāga
viṁtagā śhrīveṁkaḍeśha veside veyirūbulāya.
maṁtanaburadulu nīmaguvagunu nīgunu