Nee poruguna numdedi nerame maagu

నీ పొరుగున నుండేది నేరమే మాకు
Language

(॥పల్లవి॥)
నీ పొరుగున నుండేది నేరమే మాకు
యీపాటికే సిగ్గులు బాయిట వేతురా

(॥నీపో॥)
వాడుమోముతోఁ దలవంచుకుండఁగా నాతో
యేడనైనా నవ్వవచ్చే వింత గలదా
ఆడేవారి నెరఁగవు ఆఁటదాన నైతేనే
కోడెకాఁడ మాకుఁ గొంత గుట్టు వలదా

(॥నీపొ॥)
ముదముతోడుత మాముంగిట నేనుండఁగాను
యిదె నాచే వట్టి తీసే వింత గద్దా
మొదలు దుద యెంచవు మొకము చూచినంతనే
వెదకి పువ్వులఁగొని వేయవలెనా

(॥నీపో॥)
మాటలాడ కొకరితొ మాయంతనే వుండ గాను
యేటికి మమ్ము బిలిచే వింత గలదా
గాఁటపు శ్రీ వేంకటేశ గ్రక్కున గూడితి నన్ను
వాఁటపు యింకాఁ గొంతవాని చెప్పవలెనా

(||pallavi||)
nī pŏruguna nuṁḍedi nerame māgu
yībāḍige siggulu bāyiḍa vedurā

(||nībo||)
vāḍumomudom̐ dalavaṁchuguṁḍam̐gā nādo
yeḍanainā navvavachche viṁta galadā
āḍevāri nĕram̐gavu ām̐ṭadāna naidene
koḍĕgām̐ḍa māgum̐ gŏṁta guṭṭu valadā

(||nībŏ||)
mudamudoḍuda māmuṁgiḍa nenuṁḍam̐gānu
yidĕ nāse vaṭṭi tīse viṁta gaddā
mŏdalu duda yĕṁchavu mŏgamu sūsinaṁtane
vĕdagi puvvulam̐gŏni veyavalĕnā

(||nībo||)
māḍalāḍa kŏgaridŏ māyaṁtane vuṁḍa gānu
yeḍigi mammu bilise viṁta galadā
gām̐ṭabu śhrī veṁkaḍeśha grakkuna gūḍidi nannu
vām̐ṭabu yiṁkām̐ gŏṁtavāni sĕppavalĕnā