నీ పొందులెల్లా గంటిమి నేఁడు నీ పంతాలు చెల్లె
(॥పల్లవి॥)
నీ పొందులెల్లా గంటిమి నేఁడు నీ పంతాలు చెల్లె
భూపతిచెరువుచెంత భోగింపుచున్నాఁడవు
(॥నీపొందు॥)
ముచ్చట లాడుకొంటా మొగములు చూచుకొంటా
హెచ్చి యెంతచనవిచ్చే వింతులకును
తచ్చనలు చూపుకొంటా తమకము లెం చుకొంటా
కొచ్చి యెంతనవ్వేవు కొలువులోను
(॥నీపొందు॥)
పువ్వులను వేసుకొంటా వుప్పొడి చల్లుకొంటా
రవ్వలేమి సేసేవు రమణులను
వువ్విళ్ళూరించుకొంటాను వొడివట్టి తీసుకొంటా
చివ్వన నెంత పచ్చిగాఁ జెనకేవు నీవు
(॥నీపొందు॥)
సన్నలు సేసుకొంటా చవులు వుట్టించుకొంటా
మన్నించి యెంతకూడేవు మగువలను
యెన్నికతో నన్నేలితి వింతలో శ్రీవేంకటేశ
చన్నులేల పట్టేవు సరసము లాడుతా
(||pallavi||)
nī pŏṁdulĕllā gaṁṭimi nem̐ḍu nī paṁtālu sĕllĕ
bhūbadisĕruvusĕṁta bhogiṁpusunnām̐ḍavu
(||nībŏṁdu||)
muchchaḍa lāḍugŏṁṭā mŏgamulu sūsugŏṁṭā
hĕchchi yĕṁtasanavichche viṁtulagunu
tachchanalu sūbugŏṁṭā tamagamu lĕṁ sugŏṁṭā
kŏchchi yĕṁtanavvevu kŏluvulonu
(||nībŏṁdu||)
puvvulanu vesugŏṁṭā vuppŏḍi sallugŏṁṭā
ravvalemi sesevu ramaṇulanu
vuvviḽḽūriṁchugŏṁṭānu vŏḍivaṭṭi tīsugŏṁṭā
sivvana nĕṁta pachchigām̐ jĕnagevu nīvu
(||nībŏṁdu||)
sannalu sesugŏṁṭā savulu vuṭṭiṁchugŏṁṭā
manniṁchi yĕṁtagūḍevu maguvalanu
yĕnnigado nannelidi viṁtalo śhrīveṁkaḍeśha
sannulela paṭṭevu sarasamu lāḍudā