నీ పాపమే కాదు ఇది నిండిన లోకముజాడ
(॥పల్లవి॥)
నీ పాపమే కాదు ఇది నిండిన లోకముజాడ
పైపై వచ్చిన వలపు పాటించరెవ్వరును
(॥॥)
అట్టే మంచిమాటలాడే అతివ బాఁతి పడఁగ
చిట్టకములాడే యింతిఁ జెనకేవు
అట్టే కాదా పంచదార అండనెంత వుండినాను
పట్టి పెనఁగేటి నిమ్మపంటికి నోరూరును
(॥॥)
చేతులెత్తి మొక్కేటి చెలి గాచుకుండఁగాను
ఆతలి మోమైనవారి కాసపడేవు
జాతితోఁ బాలపండ్లు సంగడినే వుండఁగాను
ఘాతఁ బెరిగే బూరుగుఁ గాయలు చూపట్టును
(॥॥)
నెట్టనఁ బెండ్లాడిన నేనే నీకుండఁగాను
ఱట్టు గొల్లెతలచే నాఱడిఁ బొందితి
ఇట్టే నన్నుఁ గూడితివి యిందాఁకా శ్రీవేంకటేశ
వొట్టితే పాలునుఁ జల్లా నొక్కరీతి నుండును
(||pallavi||)
nī pābame kādu idi niṁḍina logamujāḍa
paibai vachchina valabu pāḍiṁcharĕvvarunu
(||||)
aṭṭe maṁchimāḍalāḍe adiva bām̐ti paḍam̐ga
siṭṭagamulāḍe yiṁtim̐ jĕnagevu
aṭṭe kādā paṁchadāra aṁḍanĕṁta vuṁḍinānu
paṭṭi pĕnam̐geḍi nimmabaṁṭigi norūrunu
(||||)
sedulĕtti mŏkkeḍi sĕli gāsuguṁḍam̐gānu
ādali momainavāri kāsabaḍevu
jādidom̐ bālabaṁḍlu saṁgaḍine vuṁḍam̐gānu
ghādam̐ bĕrige būrugum̐ gāyalu sūbaṭṭunu
(||||)
nĕṭṭanam̐ bĕṁḍlāḍina nene nīguṁḍam̐gānu
ṟaṭṭu gŏllĕdalase nāṟaḍim̐ bŏṁdidi
iṭṭe nannum̐ gūḍidivi yiṁdām̐kā śhrīveṁkaḍeśha
vŏṭṭide pālunum̐ jallā nŏkkarīdi nuṁḍunu