Nee paabamaa vori nichcham gaalamahi midi

నీ పాపమా వోరి నిచ్చఁ గాలమహి మిది
Language

(॥పల్లవి॥)
నీ పాపమా వోరి నిచ్చఁ గాలమహి మిది
ఆపాటి తగవెల్ల నంతేసి కోపుదునా

(॥నీపా॥)
కోపము వేళమె వచ్చుఁ గోరి నిజమాడితేను
యేపున శాంతము వచ్చు నిచ్చలాడువారిఁ గంటే
వోప నాదిక్కేమి చూచే వొల్లనొల్లఁ బట్టకురా
నీపాటిదొరతనము నేరఁగాక నేను

(॥నీపా॥)
యేతులు వేళమె వచ్చు నింటనున్నవారిఁ గంటే
జాతివినయాలే వచ్చు సారె వాడవారిఁ గంటే
నీతుల నీగుణమిది నేఁడు గొత్తలా నాకు
రీతి గాదు నవ్వకురా రేయిపొద్దు దోసము

(॥నీపా॥)
బీరాలు వేళమె వచ్చ ప్రియపడ్డసతిఁ గంటే రతిఁ
దారిన మొక్కులే వచ్చు దంటైనసతిఁ గంటే
యేరా శ్రీవేంకటేశ ఇది నేనెఱిఁగినదే
కూరిమిఁ గూడితి విఁక గొంకు నాకుఁ జెల్లదు

(||pallavi||)
nī pābamā vori nichcham̐ gālamahi midi
ābāḍi tagavĕlla naṁtesi kobudunā

(||nībā||)
kobamu veḽamĕ vachchum̐ gori nijamāḍidenu
yebuna śhāṁtamu vachchu nichchalāḍuvārim̐ gaṁṭe
voba nādikkemi sūse vŏllanŏllam̐ baṭṭagurā
nībāḍidŏradanamu neram̐gāga nenu

(||nībā||)
yedulu veḽamĕ vachchu niṁṭanunnavārim̐ gaṁṭe
jādivinayāle vachchu sārĕ vāḍavārim̐ gaṁṭe
nīdula nīguṇamidi nem̐ḍu gŏttalā nāgu
rīdi gādu navvagurā reyibŏddu dosamu

(||nībā||)
bīrālu veḽamĕ vachcha priyabaḍḍasadim̐ gaṁṭe radim̐
dārina mŏkkule vachchu daṁṭainasadim̐ gaṁṭe
yerā śhrīveṁkaḍeśha idi nenĕṟim̐ginade
kūrimim̐ gūḍidi vim̐ka gŏṁku nāgum̐ jĕlladu