నీ నేరుపు చూతము నిండుసాము సేతము
(॥పల్లవి॥)
నీ నేరుపు చూతము నిండుసాము సేతము
పూని చెక్కులను గోర పొందుగా వ్రాతము
(॥నీవే॥)
కప్పురవిడెము దేవే కైదండ నాకు నీవే
దప్పిదేరిచేఁగాని దగ్గరిరావే
తప్పకేమిచూచేవే తాలిమెల్లాఁ దెచ్చుకొవే
వొప్పుగ పూవులవాలు వొడ్డుకోవే
(॥నీవే॥)
గందము నాకుఁ బూయవే కరము పైవేయవే
అందుకేమి నాచెప్పినట్లు సేయవే
అంది చన్నుల రాయవే ఆస వెన్నెల గాయవే
గొందినున్న నీపయ్యదకొంగు దియ్యవే
(॥నీవే॥)
కమ్మి కాఁగిట నించవే కడుసిగ్గులు దించవే
తమ్ములమిడితి నిఁకఁ దలవంచవే
కమ్మర శ్రీవేంకటాదిఘనుఁడ నన్నేలితివి
రమ్మనుచు; నాతోడిరతి పెంచవే
(||pallavi||)
nī nerubu sūdamu niṁḍusāmu sedamu
pūni sĕkkulanu gora pŏṁdugā vrādamu
(||nīve||)
kappuraviḍĕmu deve kaidaṁḍa nāgu nīve
dappiderisem̐gāni daggarirāve
tappagemisūseve tālimĕllām̐ dĕchchugŏve
vŏppuga pūvulavālu vŏḍḍugove
(||nīve||)
gaṁdamu nāgum̐ būyave karamu paiveyave
aṁdugemi nāsĕppinaṭlu seyave
aṁdi sannula rāyave āsa vĕnnĕla gāyave
gŏṁdinunna nībayyadagŏṁgu diyyave
(||nīve||)
kammi kām̐giḍa niṁchave kaḍusiggulu diṁchave
tammulamiḍidi nim̐kam̐ dalavaṁchave
kammara śhrīveṁkaḍādighanum̐ḍa nannelidivi
rammanusu; nādoḍiradi pĕṁchave