Nee neramemchugoga nelamtanu doorevu

నీ నేరమెంచుకోక నెలఁతను దూరేవు
Language

(॥పల్లవి॥)
నీ నేరమెంచుకోక నెలఁతను దూరేవు
మేను మేనుఁ బెనఁగితే మించు గోరంటించదా

(॥॥)
సిగ్గువడ్డ చెలిమీఁద జేయి నీవు వేసితేను
దిగ్గన లేచి గొప్పతిట్టు దిట్టదా
వొగ్గి ముసుఁగు వెట్టుక వుండఁగా వీడెమిచ్చితే
బగ్గనఁ జేతిపూవుబంతిఁ గొని వేయదా

(॥॥)
తలవంచుకొన్న యాపెఁ దడవి కొంగు వట్టితే
చలముతోఁ గొసరుచు జంకించదా
వొలిసి కంబము వట్టుకున్నయాపెఁ జెనకితే
బలిమిఁ జన్నుల నొత్తి పంతములు గొనదా

(॥॥)
పాదాలొత్తే యాపెను పట్టి కాఁగిలించుకొంటే
కాదనక నీమోవి గంటి సేయదా
యీదెస శ్రీవేంకటేశ యిటు నన్ను నేలితివి
పోదిసేసి అట్టె నిన్నుఁ బొగడఁగ వలదా

(||pallavi||)
nī neramĕṁchugoga nĕlam̐tanu dūrevu
menu menum̐ bĕnam̐gide miṁchu goraṁṭiṁchadā

(||||)
sigguvaḍḍa sĕlimīm̐da jeyi nīvu vesidenu
diggana lesi gŏppadiṭṭu diṭṭadā
vŏggi musum̐gu vĕṭṭuga vuṁḍam̐gā vīḍĕmichchide
bagganam̐ jedibūvubaṁtim̐ gŏni veyadā

(||||)
talavaṁchugŏnna yābĕm̐ daḍavi kŏṁgu vaṭṭide
salamudom̐ gŏsarusu jaṁkiṁchadā
vŏlisi kaṁbamu vaṭṭugunnayābĕm̐ jĕnagide
balimim̐ jannula nŏtti paṁtamulu gŏnadā

(||||)
pādālŏtte yābĕnu paṭṭi kām̐giliṁchugŏṁṭe
kādanaga nīmovi gaṁṭi seyadā
yīdĕsa śhrīveṁkaḍeśha yiḍu nannu nelidivi
podisesi aṭṭĕ ninnum̐ bŏgaḍam̐ga valadā