Nee mumdarigi raaraadaa nemdu velayaamdlagu

నీ ముందరికి రారాదా నేఁడు వెలయాండ్లకు
Language

(॥పల్లవి॥)
నీ ముందరికి రారాదా నేఁడు వెలయాండ్లకు
ఆముకొని సరసములాడ వచ్చేవు

(॥నీముం॥)
చుట్టపువరుస నాపె సుద్దులు నీకుఁ జెప్పఁగా
గట్టిగాఁ గాలుదొక్కేవు కడనుండి
గుట్టుతోడ నీవొద్దఁ గొలువు సేయఁగాను
చిట్టంటుచేంతలు చేసి చెక్కులు నొక్కేవు

(॥నీముం॥)
నెలఁత వేడుకలకు నీమొగము చూడఁగాను
చెలరేఁగి చన్నులపైఁ జేఇ వేసేవు
సెలవుల నవ్వుకొంటా చెంగట నిలుచుండఁగా
కలువపువ్వుల వేసి కాంగిలించేవు

(॥నీముం॥)
సారె నీమాటలు విని సంతోసాన నవ్వితేను
గారవించి పచ్చడము గప్పి కూడేవు
ఆరసి శ్రీవేంకటేశ అలమేల్ మంగను నేను
సారె నన్నేలి యాపెను జంటలు సేసేవు

(||pallavi||)
nī muṁdarigi rārādā nem̐ḍu vĕlayāṁḍlagu
āmugŏni sarasamulāḍa vachchevu

(||nīmuṁ||)
suṭṭabuvarusa nābĕ suddulu nīgum̐ jĕppam̐gā
gaṭṭigām̐ gāludŏkkevu kaḍanuṁḍi
guṭṭudoḍa nīvŏddam̐ gŏluvu seyam̐gānu
siṭṭaṁṭuseṁtalu sesi sĕkkulu nŏkkevu

(||nīmuṁ||)
nĕlam̐ta veḍugalagu nīmŏgamu sūḍam̐gānu
sĕlarem̐gi sannulabaim̐ jei vesevu
sĕlavula navvugŏṁṭā sĕṁgaḍa nilusuṁḍam̐gā
kaluvabuvvula vesi kāṁgiliṁchevu

(||nīmuṁ||)
sārĕ nīmāḍalu vini saṁtosāna navvidenu
gāraviṁchi pachchaḍamu gappi kūḍevu
ārasi śhrīveṁkaḍeśha alamel maṁganu nenu
sārĕ nanneli yābĕnu jaṁṭalu sesevu