నీ మేలులోనివారము నీ వేల సిగ్గు వడేవే
(॥పల్లవి॥)
నీ మేలులోనివారము నీ వేల సిగ్గు వడేవే
దోమటి నీ చేఁతలు సంతోసించేముగాక*
(॥నీ మేలు॥)
చెక్కుల మీఁదటఁ గారే చెమటలే చెప్పీని
నెక్కొని యాతని తోడి నీ పొందులు
జక్కవ చన్నుల నుండే చందమామలే చెప్పీని
యెక్కడలేని యానలేల పెట్టుకొనేవే
(॥నీ మేలు॥)
వుమ్మగిలుచున్న నీ నిట్టూరుపులే చెప్పీని
వుమ్మడిఁ బెనఁగులాట వుదుటులెల్లా
కమ్ముకొన్న నీ మొగముకళ లివె చెప్పీని
యిమ్ముల నీ సాదుఁ దనా లేమి నెరపేవే
(॥నీ మేలు॥)
తొడరి జారిన నీ తురుమిదె చెప్పీని
కడలేని రతుల నీ కలయికలు
యెడయని శ్రీవేంకటేశు వుంగరమే చెప్పీ
యెడ నెడ నీ పంతా లెన్ని చెప్పేవే
(||pallavi||)
nī melulonivāramu nī vela siggu vaḍeve
domaḍi nī sem̐talu saṁtosiṁchemugāga*
(||nī melu||)
sĕkkula mīm̐daḍam̐ gāre sĕmaḍale sĕppīni
nĕkkŏni yādani toḍi nī pŏṁdulu
jakkava sannula nuṁḍe saṁdamāmale sĕppīni
yĕkkaḍaleni yānalela pĕṭṭugŏneve
(||nī melu||)
vummagilusunna nī niṭṭūrubule sĕppīni
vummaḍim̐ bĕnam̐gulāḍa vuduḍulĕllā
kammugŏnna nī mŏgamugaḽa livĕ sĕppīni
yimmula nī sādum̐ danā lemi nĕrabeve
(||nī melu||)
tŏḍari jārina nī turumidĕ sĕppīni
kaḍaleni radula nī kalayigalu
yĕḍayani śhrīveṁkaḍeśhu vuṁgarame sĕppī
yĕḍa nĕḍa nī paṁtā lĕnni sĕppeve