Nee melulonidaana neevu mannimchedidaana

నీ మేలులోనిదాన నీవు మన్నించేటిదాన
Language

(॥పల్లవి॥)
నీ మేలులోనిదాన నీవు మన్నించేటిదాన
దోమటి నన్నియు నీ చేతుల నున్న వికఁను

(॥నీ మేలు॥)
సేస వెట్టి నవ్వినట్టిచెలియను నేను నాకు
ఆసలు రేఁచితి విఁక నలయించకు
వాసితో నీ వే మనినా వద్దనేటిదానఁ గాను
దోసముఁ ఋణ్యము నీ చేతుల నున్న విఁకను

(॥నీ మేలు॥)
యిల్లాల నయినయట్టి యిచ్చకురాల నా
వుల్లము దెలుసుకొంటి వొరసితిని
వెల్లవిరి నీ వెటున్నా వెంగె మాడేదానఁ గాను
తొల్లిటిబాసలు నీ చేతుల నున్న విఁకనూ

(॥నీమేలు॥)
పట్టపుదేవిని నాపంత మెల్లా నీడేరించి
జిట్టిగొంటివి నామాట సమ్మతించితి
గుట్టుతో శ్రీవెంటేశ కూడితివి వింతగాను
తొట్టి నా భోగము నీ చేతుల నున్న దిఁకనూ

(||pallavi||)
nī melulonidāna nīvu manniṁcheḍidāna
domaḍi nanniyu nī sedula nunna vigam̐nu

(||nī melu||)
sesa vĕṭṭi navvinaṭṭisĕliyanu nenu nāgu
āsalu rem̐sidi vim̐ka nalayiṁchagu
vāsido nī ve maninā vaddaneḍidānam̐ gānu
dosamum̐ ṛṇyamu nī sedula nunna vim̐kanu

(||nī melu||)
yillāla nayinayaṭṭi yichchagurāla nā
vullamu dĕlusugŏṁṭi vŏrasidini
vĕllaviri nī vĕḍunnā vĕṁgĕ māḍedānam̐ gānu
tŏlliḍibāsalu nī sedula nunna vim̐kanū

(||nīmelu||)
paṭṭabudevini nābaṁta mĕllā nīḍeriṁchi
jiṭṭigŏṁṭivi nāmāḍa sammadiṁchidi
guṭṭudo śhrīvĕṁṭeśha kūḍidivi viṁtagānu
tŏṭṭi nā bhogamu nī sedula nunna dim̐kanū