Nee manasuloni maada ne neramganaa

నీ మనసులోని మాట నే నెరఁగనా
Language

(॥పల్లవి॥)
నీ మనసులోని మాట నే నెరఁగనా
కామించి నీవే నాకుఁ గల వని వుందునూ

(॥నీమన॥)
నాకే వలతు వంటా నాపై బత్తి గల వంటా
ఆక డీకడివారితో నాడుకొందును
యీకడ నన్ను మన్నించి యింటి కిట్టె వచ్చే వంటా
తూకొని నీరాకల కెదురు చూతును

(॥నీమన॥)
నమ్మఁగలవాఁడ వంటా నామాట గడవ వంటా
కమ్మిని నిన్నే పొద్దునుఁ బొగడుచుందునూ
రమ్మని నిన్నుఁ బిలిచి రతుల మెప్పించే నంటా
నెమ్మది నుపాయములు నేరుచుకుండుదును

(॥నీ మన॥)
యిద్దరము నొక్క టంటా నెగ్గు దప్పు లెంచ వంటా
పెద్దరికమున సరి పెనఁగుదును
అద్దివో శ్రీవెంకటేశ అట్టె కా నన్నుఁ గూడితి
పొద్దు వొద్దు నీకు నిట్టె బోదింతునూ

(||pallavi||)
nī manasuloni māḍa ne nĕram̐ganā
kāmiṁchi nīve nāgum̐ gala vani vuṁdunū

(||nīmana||)
nāge valadu vaṁṭā nābai batti gala vaṁṭā
āga ḍīgaḍivārido nāḍugŏṁdunu
yīgaḍa nannu manniṁchi yiṁṭi kiṭṭĕ vachche vaṁṭā
tūgŏni nīrāgala kĕduru sūdunu

(||nīmana||)
nammam̐galavām̐ḍa vaṁṭā nāmāḍa gaḍava vaṁṭā
kammini ninne pŏddunum̐ bŏgaḍusuṁdunū
rammani ninnum̐ bilisi radula mĕppiṁche naṁṭā
nĕmmadi nubāyamulu nerusuguṁḍudunu

(||nī mana||)
yiddaramu nŏkka ṭaṁṭā nĕggu dappu lĕṁcha vaṁṭā
pĕddarigamuna sari pĕnam̐gudunu
addivo śhrīvĕṁkaḍeśha aṭṭĕ kā nannum̐ gūḍidi
pŏddu vŏddu nīgu niṭṭĕ bodiṁtunū