నీ మనసు కొలదింతే నేమేమి విన్నవించేము
(॥పల్లవి॥)
నీ మనసు కొలదింతే నేమేమి విన్నవించేము
దీమసాన నీకు నీవే తెలుసుకో నేఁడు
(॥నీమ॥)
చిప్పిల నాపె నీతో సెలవుల నవ్వితేను
కప్పురము చల్లెనంటాఁ గాఁతాళించేవు
వుప్పతిల్లు మనసు వేరొకచోట నుండితేను
వుప్పనున్నాఁ జప్ప నౌను వున్నసుద్దులేఁటికి
(॥నీమ॥)
తళుకుఁజూపుల నాకె తప్పక చూచితేను
కలువల వేసెనంటాఁ గాతాళించేవు
వలపు వేరొకచోట వాడికె గలిగితేను
చలువైనా వేడౌను సాదించ నేటికి
(॥నీమ॥)
కుమ్మరించి కుమ్మరించి కొసరి మాటాడితేను
కమ్మఁదేనె చిమ్మెనంటాఁ గాతాళించేవు
ఇమ్ముల శ్రీవేంకటేశ యెనసితివి చెలిని
నెమ్మిఁ దిట్టే దీవనౌను నేరమెంచ నేఁటికి
(||pallavi||)
nī manasu kŏladiṁte nememi vinnaviṁchemu
dīmasāna nīgu nīve tĕlusugo nem̐ḍu
(||nīma||)
sippila nābĕ nīdo sĕlavula navvidenu
kappuramu sallĕnaṁṭām̐ gām̐tāḽiṁchevu
vuppadillu manasu verŏgasoḍa nuṁḍidenu
vuppanunnām̐ jappa naunu vunnasuddulem̐ṭigi
(||nīma||)
taḽugum̐jūbula nāgĕ tappaga sūsidenu
kaluvala vesĕnaṁṭām̐ gādāḽiṁchevu
valabu verŏgasoḍa vāḍigĕ galigidenu
saluvainā veḍaunu sādiṁcha neḍigi
(||nīma||)
kummariṁchi kummariṁchi kŏsari māḍāḍidenu
kammam̐denĕ simmĕnaṁṭām̐ gādāḽiṁchevu
immula śhrīveṁkaḍeśha yĕnasidivi sĕlini
nĕmmim̐ diṭṭe dīvanaunu neramĕṁcha nem̐ṭigi