Nee manasettunnado ne nerumganu

నీ మనసెట్టున్నదో నే నెరుఁగను
Language

(॥పల్లవి॥)
నీ మనసెట్టున్నదో నే నెరుఁగను
గామిడైనానాయఁగాని కాంతతో నవ్వితిని

(॥నీమ॥)
సంగడి జాణతనాలు సతి నీతో నాడఁగాను
వెంగెమైనా నాయంగాని వింటానుంటిని
సంగతిగా నెలుఁగెత్తి సారె నిన్నుఁబాడఁగాను
పంగెనైనా నాయఁగాని పైపై మెచ్చితిని

(॥నీమ॥)
ఆసరేఁచి ఆకె నీ యాయాలు ముట్టఁగాను
దోసమైనా నాయఁగాని తొంగి చూచితి
వోసరించ కప్పుడే నీ వూడిగాలు సేయఁగాను
వేసాలైనా నాయఁగాని వేడుకపడితిని

(॥నీమ॥)
నెమ్మది శ్రీవేంకటేశ నిన్ను నాకె గూడఁగాను
యెమ్మెలైనా నాయఁగాని ఇయ్యకొంటిని
కమ్మర నన్నేలితివి కందువ కాపె రాఁగాను
దొమ్మియైనా నాయఁగాని తొల్లె రమ్మంటివి

(||pallavi||)
nī manasĕṭṭunnado ne nĕrum̐ganu
gāmiḍainānāyam̐gāni kāṁtado navvidini

(||nīma||)
saṁgaḍi jāṇadanālu sadi nīdo nāḍam̐gānu
vĕṁgĕmainā nāyaṁgāni viṁṭānuṁṭini
saṁgadigā nĕlum̐gĕtti sārĕ ninnum̐bāḍam̐gānu
paṁgĕnainā nāyam̐gāni paibai mĕchchidini

(||nīma||)
āsarem̐si āgĕ nī yāyālu muṭṭam̐gānu
dosamainā nāyam̐gāni tŏṁgi sūsidi
vosariṁcha kappuḍe nī vūḍigālu seyam̐gānu
vesālainā nāyam̐gāni veḍugabaḍidini

(||nīma||)
nĕmmadi śhrīveṁkaḍeśha ninnu nāgĕ gūḍam̐gānu
yĕmmĕlainā nāyam̐gāni iyyagŏṁṭini
kammara nannelidivi kaṁduva kābĕ rām̐gānu
dŏmmiyainā nāyam̐gāni tŏllĕ rammaṁṭivi