Nee mana simkaa raadu ne nemi seduraa

నీ మన సింకా రాదు నే నేమి సేతురా
Language

(॥పల్లవి॥)
నీ మన సింకా రాదు నే నేమి సేతురా
యేమాట కాట ఇంతేల దూరులు

(॥నీమ॥)
అంటినా నిన్నేమైన నందరిలోఁ బచ్చిసేసి
కంటకములాడితినా కపటాలెత్తి
వెంట వెంట నీ గుట్టు వెల్లవిరిసేసితినా
ఇంటిలోన నున్నదాన నిఁక నేలదూరులు

(॥నీమ॥)
రమ్మంటినా నిన్ను రమణివద్ద నుండఁగ
సొమ్మల మోవికెంపులు చూడఁబోతిని
నెమ్మది నీ యానలలో నేఁదప్పువట్టితిని
వుమ్మడినే వున్నదాన నూరకేల దూరును

(॥నీమ॥)
యీడ నన్నుఁ గూడి చిత్త మేడ నున్నదంటినా
వాడుమోము తెల్లఁ బారవద్దంటినా
యీడులేక శ్రీవేంకటేశ కూడితివి నన్ను
వేడుకతో నున్నదాన వేయేల దూరుదు

(||pallavi||)
nī mana siṁkā rādu ne nemi sedurā
yemāḍa kāḍa iṁtela dūrulu

(||nīma||)
aṁṭinā ninnemaina naṁdarilom̐ bachchisesi
kaṁṭagamulāḍidinā kabaḍālĕtti
vĕṁṭa vĕṁṭa nī guṭṭu vĕllavirisesidinā
iṁṭilona nunnadāna nim̐ka neladūrulu

(||nīma||)
rammaṁṭinā ninnu ramaṇivadda nuṁḍam̐ga
sŏmmala movigĕṁpulu sūḍam̐bodini
nĕmmadi nī yānalalo nem̐dappuvaṭṭidini
vummaḍine vunnadāna nūragela dūrunu

(||nīma||)
yīḍa nannum̐ gūḍi sitta meḍa nunnadaṁṭinā
vāḍumomu tĕllam̐ bāravaddaṁṭinā
yīḍulega śhrīveṁkaḍeśha kūḍidivi nannu
veḍugado nunnadāna veyela dūrudu