నీ మన సెట్టుండునో నేనెరఁగను
(॥పల్లవి॥)
నీ మన సెట్టుండునో నేనెరఁగను
కోమలపుఁ బలుకులఁ గొసరే నే నిదివో
(॥నీ మన॥)
తప్పక చూడగ నోప తల వంచుకొన నోప
చిప్పిలుఁ జెమటతోడి సిగ్గలే కాని
ముప్పిరి ములుగ నోప ముందటనే నగ నోప
అప్పటప్పటికి నుస్సు రనుటే కాని
(॥నీ మన॥)
యేమీ నడుగనోప యెవ్వరిఁ గోపించ నోప
ఆమని జాగరముల అలపే కాని
నేమపువ్రతాల కోప నిండుమాయలకు నోప
చే మంచి తమకలము చింతించుటే కాని
(॥నీమన॥)
బుద్దులు చెప్పఁగ నోప బూములు దొక్కఁగ నోప
వొద్దనె పాయక నీతో నుండుటే కాని
గద్దరి శ్రీవెంకటేశ కలసితి విదె నన్ను
వద్దని తోయఁగ నోప వంచుటే కాని
(||pallavi||)
nī mana sĕṭṭuṁḍuno nenĕram̐ganu
komalabum̐ balugulam̐ gŏsare ne nidivo
(||nī mana||)
tappaga sūḍaga noba tala vaṁchugŏna noba
sippilum̐ jĕmaḍadoḍi siggale kāni
muppiri muluga noba muṁdaḍane naga noba
appaḍappaḍigi nussu ranuḍe kāni
(||nī mana||)
yemī naḍuganoba yĕvvarim̐ gobiṁcha noba
āmani jāgaramula alabe kāni
nemabuvradāla koba niṁḍumāyalagu noba
se maṁchi tamagalamu siṁtiṁchuḍe kāni
(||nīmana||)
buddulu sĕppam̐ga noba būmulu dŏkkam̐ga noba
vŏddanĕ pāyaga nīdo nuṁḍuḍe kāni
gaddari śhrīvĕṁkaḍeśha kalasidi vidĕ nannu
vaddani toyam̐ga noba vaṁchuḍe kāni