నీ మన సెట్టు దెలుసు నే మెంతవారము
(॥పల్లవి॥)
నీ మన సెట్టు దెలుసు నే మెంతవారము
మోము చూచి నీ కిందుకే మొక్కేము నేము
(॥॥)
వొక్కతెపైఁ బరాకై నట్టుండుదువు
గక్కన మా మోము చూచి కరుణింతువు
నిక్కపు రాజసములు నెరపుదువూ
మక్కువఁ జేయి చాఁచి మన్నింతువూ
(॥॥)
కుమ్మరింపు సిగ్గులతో గుట్టు సేతువు
సమ్మతించి యంతలోనే చనవిత్తువూ
యెమ్మెలకు నింపు చల్లి యెలయింతువూ
కమ్మర నే పొద్దూ నా కౌఁగిటనే వుందువు
(॥॥)
వేడుకకు నీవు సెలవి నవ్వుదువూ
జోడు గూడి నీ మహిమ చూపుదువూ
యీడనే శ్రీ వేంకటేశ యే నలమేలుమంగను
జాడ దప్పక నీ మోవిచవులు చూపుదువు.
(||pallavi||)
nī mana sĕṭṭu dĕlusu ne mĕṁtavāramu
momu sūsi nī kiṁduge mŏkkemu nemu
(||||)
vŏkkadĕbaim̐ barāgai naṭṭuṁḍuduvu
gakkana mā momu sūsi karuṇiṁtuvu
nikkabu rājasamulu nĕrabuduvū
makkuvam̐ jeyi sām̐si manniṁtuvū
(||||)
kummariṁpu siggulado guṭṭu seduvu
sammadiṁchi yaṁtalone sanavittuvū
yĕmmĕlagu niṁpu salli yĕlayiṁtuvū
kammara ne pŏddū nā kaum̐giḍane vuṁduvu
(||||)
veḍugagu nīvu sĕlavi navvuduvū
joḍu gūḍi nī mahima sūbuduvū
yīḍane śhrī veṁkaḍeśha ye nalamelumaṁganu
jāḍa dappaga nī movisavulu sūbuduvu.