నీ మహిమో నాలోన నిండిన వలపుజాడో
(॥పల్లవి॥)
నీ మహిమో నాలోన నిండిన వలపుజాడో
యేమి సేతు నన్నెపుడు వెడయకువయ్యా
(॥నీమ॥)
యెనని నీతో నేను యెంతవడి మాటాడినా
తనియదు నామనసు తమి యెట్టిదో
వినయముతో రెప్పలువేయక చూచినాను
నినుపులై మమతలు నిచ్చ కొత్తలు
(॥నీమ॥)
చలపట్టి నీతోను సారెసారెఁ బెనఁగిన-
నలయదు నామేను ఆస యెట్టిదో
కొలువులో నీవద్దఁ గూచుండి యెంతనవ్విన
తలఁపులో కోరికలు తరగనిధాన్యాలు
(॥నీమ॥)
కడఁగి యందాఁకా నిన్నుఁ గాఁగిలించుకుండినాను
విడువవు చేతులు వేడుకెట్టిదో
అడరి శ్రీవేంకటేశ యలమేల్‌మంగను నేను
తొడరి యేలితివి రతులు తరితీపులు
(||pallavi||)
nī mahimo nālona niṁḍina valabujāḍo
yemi sedu nannĕbuḍu vĕḍayaguvayyā
(||nīma||)
yĕnani nīdo nenu yĕṁtavaḍi māḍāḍinā
taniyadu nāmanasu tami yĕṭṭido
vinayamudo rĕppaluveyaga sūsinānu
ninubulai mamadalu nichcha kŏttalu
(||nīma||)
salabaṭṭi nīdonu sārĕsārĕm̐ bĕnam̐gina-
nalayadu nāmenu āsa yĕṭṭido
kŏluvulo nīvaddam̐ gūsuṁḍi yĕṁtanavvina
talam̐pulo korigalu taraganidhānyālu
(||nīma||)
kaḍam̐gi yaṁdām̐kā ninnum̐ gām̐giliṁchuguṁḍinānu
viḍuvavu sedulu veḍugĕṭṭido
aḍari śhrīveṁkaḍeśha yalamelmaṁganu nenu
tŏḍari yelidivi radulu taridībulu