Nee mahima linnidigi neelagamthudu saakshi

నీ మహిమ లిన్నిటికి నీలకంఠుడు సాక్షి
Language

(॥పల్లవి॥)
నీ మహిమ లిన్నిటికి నీలకంఠుడు సాక్షి
దామోదర మమ్ముఁ గావు దాసులము మీకు

(॥నీమ॥)
కాలకూటవిషమైన గక్కున నరగుటకు
తాలిమితో నీ నామత్రయ మంత్రము
సోలిఁ బాముల వాయి కట్టే సొమ్ముగా ధరించుటకు
ఆలరి గరుడవాహనాయుధ ధారణము

(॥నీమ॥)
పట్టిన బ్రహ్మహత్య ప్రాయశ్చిత్తమునకు
వొట్టినట్టి తారక బ్రహ్మోపదేశము
అట్టకపాల భోజనా శుచి పరిహారము
గట్టిగ నీ పాదతీర్థపు గంగానది

(॥నీమ॥)
చెలఁగి భూతపిశాచసేవ నివారించుటకు
తలఁచేటి నీ మహాతత్త్వ యోగము
బలిమి సర్వమంగళాస్పదమై నిలుచుటకు
యిలపై శ్రీ వేంకటేశ యిదె నీ సాకారము

(||pallavi||)
nī mahima linniḍigi nīlagaṁṭhuḍu sākṣhi
dāmodara mammum̐ gāvu dāsulamu mīgu

(||nīma||)
kālagūḍaviṣhamaina gakkuna naraguḍagu
tālimido nī nāmatraya maṁtramu
solim̐ bāmula vāyi kaṭṭe sŏmmugā dhariṁchuḍagu
ālari garuḍavāhanāyudha dhāraṇamu

(||nīma||)
paṭṭina brahmahatya prāyaśhchittamunagu
vŏṭṭinaṭṭi tāraga brahmobadeśhamu
aṭṭagabāla bhojanā śhusi parihāramu
gaṭṭiga nī pādadīrdhabu gaṁgānadi

(||nīma||)
sĕlam̐gi bhūdabiśhāsaseva nivāriṁchuḍagu
talam̐seḍi nī mahādattva yogamu
balimi sarvamaṁgaḽāspadamai nilusuḍagu
yilabai śhrī veṁkaḍeśha yidĕ nī sāgāramu