Nee mahima dalamsugoni neeve rakshimchuda gaaga

నీ మహిమ దలఁచుకొని నీవే రక్షించుట గాక
Language

(॥పల్లవి॥)
నీ మహిమ దలఁచుకొని నీవే రక్షించుట గాక
స్వామివి మామీఁద నీవు సడివేయ నేలా

(॥నీమ॥)
నే నొక్క యణుమాత్రము నీవు మహద్రూపుఁడవు
కానీలే నీ ముందర నా కథ యేమి
పూచి చిత్రగుప్తులచే పుణ్యపాపము వ్రాయించి
ఆని లోకాల కెక్కించి ఆఱడిఁ బెట్ట నేలా

(॥నీమ॥)
నేర నేఁ బరతంత్రుఁడ నీవు స్వతంత్రుఁడవు
యీరీతివాఁడ నను నెంచ నేది
సారెకు రవిచంద్రులసాక్షిగా మా కిటు లెట్టి
కోరి పనులు సేయించి గొరబు సేయ నేలా

(॥నీమ॥)
యెందు నే లక్ష్యము గాను యిన్న నీవు లక్ష్యము
పొందుగా ని న్నెంచే చోట భువి నే నెంతా
విందుగ నలమేల్మంగ విభుఁడ శ్రీవేంకటేశ
కందువ నా యాత్మ వింత గరిసించ నేలా

(||pallavi||)
nī mahima dalam̐sugŏni nīve rakṣhiṁchuḍa gāga
svāmivi māmīm̐da nīvu saḍiveya nelā

(||nīma||)
ne nŏkka yaṇumātramu nīvu mahadrūbum̐ḍavu
kānīle nī muṁdara nā katha yemi
pūsi sitraguptulase puṇyabābamu vrāyiṁchi
āni logāla kĕkkiṁchi āṟaḍim̐ bĕṭṭa nelā

(||nīma||)
nera nem̐ baradaṁtrum̐ḍa nīvu svadaṁtrum̐ḍavu
yīrīdivām̐ḍa nanu nĕṁcha nedi
sārĕgu ravisaṁdrulasākṣhigā mā kiḍu lĕṭṭi
kori panulu seyiṁchi gŏrabu seya nelā

(||nīma||)
yĕṁdu ne lakṣhyamu gānu yinna nīvu lakṣhyamu
pŏṁdugā ni nnĕṁche soḍa bhuvi ne nĕṁtā
viṁduga nalamelmaṁga vibhum̐ḍa śhrīveṁkaḍeśha
kaṁduva nā yātma viṁta garisiṁcha nelā