నీ మగఁడు కొలువులో నీపైనే చల్లీ వలపు
(॥పల్లవి॥)
నీ మగఁడు కొలువులో నీపైనే చల్లీ వలపు
నేమపు వూడిగాలెల్లా నీవే సేయవమ్మా
(॥॥)
తప్పుక చూచి నతఁడు తతిగొని నీదిక్కు
యిప్పుడే కానుకలెల్లా నియ్యవమ్మా
కప్పురము చల్లుకొంటాఁ గమ్మటి సుద్దులడిగీ
చిప్పిల విన్నపాలెల్లా జేసుకొనవమ్మా
(॥॥)
చెంగట నీవుండఁగాను సెలవి నవ్వీ నతఁడు
యింగిత మెఱిఁగి వీడె మియ్యవమ్మా
అంగమునఁ దట్టుపుణుఁగులదు కొంటాఁ జెనకీ
సంగతిఁ జేయెత్తి మొక్కి సరసమాడవమ్మా
(॥॥)
అలమేలుమంగవు నిన్నక్కునఁ గట్టుకొనెను
అలమి శ్రీవేంకటేశు కాసలీవమ్మా
పలుసొమ్ము వెట్టుకొంటాఁ బయ్యదకొంగు వట్టీని
అలరి పొత్తున నిట్టే యారగించవమ్మా
(||pallavi||)
nī magam̐ḍu kŏluvulo nībaine sallī valabu
nemabu vūḍigālĕllā nīve seyavammā
(||||)
tappuga sūsi nadam̐ḍu tadigŏni nīdikku
yippuḍe kānugalĕllā niyyavammā
kappuramu sallugŏṁṭām̐ gammaḍi suddulaḍigī
sippila vinnabālĕllā jesugŏnavammā
(||||)
sĕṁgaḍa nīvuṁḍam̐gānu sĕlavi navvī nadam̐ḍu
yiṁgida mĕṟim̐gi vīḍĕ miyyavammā
aṁgamunam̐ daṭṭubuṇum̐guladu kŏṁṭām̐ jĕnagī
saṁgadim̐ jeyĕtti mŏkki sarasamāḍavammā
(||||)
alamelumaṁgavu ninnakkunam̐ gaṭṭugŏnĕnu
alami śhrīveṁkaḍeśhu kāsalīvammā
palusŏmmu vĕṭṭugŏṁṭām̐ bayyadagŏṁgu vaṭṭīni
alari pŏttuna niṭṭe yāragiṁchavammā