Nee magam dimdarilona neebaine valabu soobee

నీ మగఁ డిందరిలోన నీపైనే వలపు చూపీ
Language

(॥పల్లవి॥)
నీ మగఁ డిందరిలోన నీపైనే వలపు చూపీ
చే ముంచి కైవస మెంత సేసుకొంటివో

(॥నీమ॥)
సారె నీమొగ మాతఁడు చల్లుఁజూపులను జూచి
నారువోసినట్లనే నవ్వులు నవ్వీ
నేరుపులెల్లా మెరసి నీతోనే మాటలాడీ
దారకాన నీ వెంతతపము సేసితివో

(॥నీమ॥)
చేరి నిన్ను రమణుఁడు చెక్కునొక్కి వేఁడుకొని
గారవించి నీగుణాలు కడుమెచ్చీని
చేరువనే కూచుండి సింగారాలు నీకుఁ జేసీ
చూరలుగా మనసెంత చొక్క జేసితివొ

(॥నీమ॥)
అలమి శ్రీవేంకటేశుఁ డంది నీకు విడెమిచ్చి
తలకోన లాలించి తమిరేఁచీని
అలమేలుమంగవు నీయంకెలనే మెలఁగీని
పిలి చెటువంటివేళఁ బెండ్లియాడితివొ

(||pallavi||)
nī magam̐ ḍiṁdarilona nībaine valabu sūbī
se muṁchi kaivasa mĕṁta sesugŏṁṭivo

(||nīma||)
sārĕ nīmŏga mādam̐ḍu sallum̐jūbulanu jūsi
nāruvosinaṭlane navvulu navvī
nerubulĕllā mĕrasi nīdone māḍalāḍī
dāragāna nī vĕṁtadabamu sesidivo

(||nīma||)
seri ninnu ramaṇum̐ḍu sĕkkunŏkki vem̐ḍugŏni
gāraviṁchi nīguṇālu kaḍumĕchchīni
seruvane kūsuṁḍi siṁgārālu nīgum̐ jesī
sūralugā manasĕṁta sŏkka jesidivŏ

(||nīma||)
alami śhrīveṁkaḍeśhum̐ ḍaṁdi nīgu viḍĕmichchi
talagona lāliṁchi tamirem̐sīni
alamelumaṁgavu nīyaṁkĕlane mĕlam̐gīni
pili sĕḍuvaṁṭiveḽam̐ bĕṁḍliyāḍidivŏ