నీ మగఁ డాతఁడె వచ్చి నిలుచున్నాఁ డెదుటను
(॥పల్లవి॥)
నీ మగఁ డాతఁడె వచ్చి నిలుచున్నాఁ డెదుటను
గోమున నిద్దరు మీరే కూడివుండఁ గదరే
(॥నీమ॥)
మొగమెత్తి చూచితేను మోహము దెలియవచ్చు
నగితేను మాటలాడి నమ్మంచవచ్చు
తగవులు నడపితేఁ దప్పులు దేరుచవచ్చు
యెగసక్కేల నుండఁగా నెట్టు బుద్ది చెప్పేమే
(॥నీమ॥)
చుట్టరికమే చూపితే సుద్దులడుగఁగవచ్చు
నెట్టైనఁ బైకొంటేఁ బ్రేమ నెరపవచ్చు
గుట్టెరఁగ మెలఁగితే గుణము దెలియవచ్చు
వొట్టు వెట్టుకోఁగా నెట్టు వొడఁబరచేదే
(॥నీమ॥)
కలపుకోలు గలితే కానుక లియ్యఁగవచ్చు
మెలుపున నియ్యకొంటే మెచ్చఁగవచ్చు
యేలమి శ్రీవేంకటేశ యిదివో నిన్నుఁ గూడె
చలపట్టితే నెట్టు చవులు వుట్టించేమే
(||pallavi||)
nī magam̐ ḍādam̐ḍĕ vachchi nilusunnām̐ ḍĕduḍanu
gomuna niddaru mīre kūḍivuṁḍam̐ gadare
(||nīma||)
mŏgamĕtti sūsidenu mohamu dĕliyavachchu
nagidenu māḍalāḍi nammaṁchavachchu
tagavulu naḍabidem̐ dappulu derusavachchu
yĕgasakkela nuṁḍam̐gā nĕṭṭu buddi sĕppeme
(||nīma||)
suṭṭarigame sūbide suddulaḍugam̐gavachchu
nĕṭṭainam̐ baigŏṁṭem̐ brema nĕrabavachchu
guṭṭĕram̐ga mĕlam̐gide guṇamu dĕliyavachchu
vŏṭṭu vĕṭṭugom̐gā nĕṭṭu vŏḍam̐barasede
(||nīma||)
kalabugolu galide kānuga liyyam̐gavachchu
mĕlubuna niyyagŏṁṭe mĕchcham̐gavachchu
yelami śhrīveṁkaḍeśha yidivo ninnum̐ gūḍĕ
salabaṭṭide nĕṭṭu savulu vuṭṭiṁcheme