Nee madagamu lanniyu ne neramganaa

నీ మతకము లన్నియు నే నెరఁగనా
Language

(॥పల్లవి॥)
నీ మతకము లన్నియు నే నెరఁగనా
యేమి దలఁచుకొంటివో యింతలో నవ్వితివి

(॥నీమత॥)
పిలిచినప్పుడె రాక పెనఁగి పెనఁగి నాతో
బలిమి వచ్చిన రాక పట్టఁ బనేది
అలుక సేసుకొంటివి అక్కడికిఁ బోవలసి
తెలుసుకొని యేఁటికో తిరిగి వచ్టితివి

(॥నీమత॥)
తప్పక నేఁ జూడఁ గాను తల వంచి వంచి నీవు
యిప్పుడు నీవు చూచితే నియ్యకొందునా
అప్పుడే వెఱచితి వేయంగన గనునో యంటా
కొప్పు మాఁటు సేసుకొని గొబ్బునఁ జూచితివి

(॥నీమత॥)
చెనకినప్పుడె లోఁగి చేతులఁ దప్పించుకొని
వెనక నన్నుఁ గూడితే వింత మానునా
అనుఁగు శ్రీవెంకటేశ అలమేలుమంగ నని
మన సిచ్చి యిప్పుడు గా మగుడఁ గూడితివి

(||pallavi||)
nī madagamu lanniyu ne nĕram̐ganā
yemi dalam̐sugŏṁṭivo yiṁtalo navvidivi

(||nīmada||)
pilisinappuḍĕ rāga pĕnam̐gi pĕnam̐gi nādo
balimi vachchina rāga paṭṭam̐ banedi
aluga sesugŏṁṭivi akkaḍigim̐ bovalasi
tĕlusugŏni yem̐ṭigo tirigi vachṭidivi

(||nīmada||)
tappaga nem̐ jūḍam̐ gānu tala vaṁchi vaṁchi nīvu
yippuḍu nīvu sūside niyyagŏṁdunā
appuḍe vĕṟasidi veyaṁgana ganuno yaṁṭā
kŏppu mām̐ṭu sesugŏni gŏbbunam̐ jūsidivi

(||nīmada||)
sĕnaginappuḍĕ lom̐gi sedulam̐ dappiṁchugŏni
vĕnaga nannum̐ gūḍide viṁta mānunā
anum̐gu śhrīvĕṁkaḍeśha alamelumaṁga nani
mana sichchi yippuḍu gā maguḍam̐ gūḍidivi