Nee maamte nijamu nelamtalu pekkulaide

నీ మాఁటే నిజము నెలఁతలు పెక్కులైతే
Language

(॥పల్లవి॥)
నీ మాఁటే నిజము నెలఁతలు పెక్కులైతే
మోములు చూచి చూచి మొగచాటే కాదా

(॥నీమాఁ॥)
వొప్పుగా ఆకెయు నేను వొక పోలి కనేవు
కప్పురము దిన్న నోటఁ గల్ల లాడేవా
యెప్పుడు దామెరపువ్వు లెచ్చుకుందులైతే నేమి
దెప్పరపు పువ్వుఁదేనె తీపె కాదా

(॥నీమాఁ॥)
వెగటై రెండు చేతుల విడే లొక్కప రిచ్చేవు
తగవరి వన్నిటాను తప్పఁజేసేవా
బిగిసి కంటమాలలో పిన్న పెద్దముత్తే లుంటే
జగతిఁ బెట్టేవారికి సరియే కాదా

(॥నీమాఁ॥)
యీవేళ నానలువెట్టి యిద్దరిని గూడితివి
శ్రీ వేంకటేశ్వర నీవు సిగ్గువడేవా
కైవశపు మొగవాఁడు కప్పేనని కూరిచితే
భావించ రెండు చీరలు పచ్చడము గాదా

(||pallavi||)
nī mām̐ṭe nijamu nĕlam̐talu pĕkkulaide
momulu sūsi sūsi mŏgasāḍe kādā

(||nīmām̐||)
vŏppugā āgĕyu nenu vŏga poli kanevu
kappuramu dinna noḍam̐ galla lāḍevā
yĕppuḍu dāmĕrabuvvu lĕchchuguṁdulaide nemi
dĕpparabu puvvum̐denĕ tībĕ kādā

(||nīmām̐||)
vĕgaḍai rĕṁḍu sedula viḍe lŏkkaba richchevu
tagavari vanniḍānu tappam̐jesevā
bigisi kaṁṭamālalo pinna pĕddamutte luṁṭe
jagadim̐ bĕṭṭevārigi sariye kādā

(||nīmām̐||)
yīveḽa nānaluvĕṭṭi yiddarini gūḍidivi
śhrī veṁkaḍeśhvara nīvu sigguvaḍevā
kaivaśhabu mŏgavām̐ḍu kappenani kūriside
bhāviṁcha rĕṁḍu sīralu pachchaḍamu gādā