Nee maamta vininadaamka nilusunnaam daadamdu

నీ మాఁట వినినదాఁక నిలుచున్నాఁ డాతఁడు
Language

(॥పల్లవి॥)
నీ మాఁట వినినదాఁక నిలుచున్నాఁ డాతఁడు
భామ నీ గుట్టెల్లా నిట్లె పచరించఁ గదవే

(॥నీవ॥)
మలసిన నీమాఁటలు మరఁగులలో నున్నవి
తలఁపులు వలపులఁ దగిలున్నవి
నెలకొన్న మురిపెము నిలువున నున్నది
యెలమి మీఁదటిమాఁట యేమనేవే యిఁకను

(॥నీవ॥)
చిఱుత నవ్వులు నీసెలవులలో నున్నవి
మెఱయు చెమటలు నీమేన నున్నవి
కఱతల నేరుపులు కడకన్నుల మన్నవి
యెఱఁగము నీవుపమ లేమనేవే యిఁకను

(॥నీవ॥)
సందడించే సిగ్గులెల్ల చనుమొనల నున్నవి
కందువ తేనెలు మోవిఁ గప్పి వున్నవి
యిందుకే విచ్చేసి నిన్ను నేలె శ్రీవేంకటేశుఁడు
యిందరివంటివారమే యేమనేవే యిఁకను

(||pallavi||)
nī mām̐ṭa vininadām̐ka nilusunnām̐ ḍādam̐ḍu
bhāma nī guṭṭĕllā niṭlĕ pasariṁcham̐ gadave

(||nīva||)
malasina nīmām̐ṭalu maram̐gulalo nunnavi
talam̐pulu valabulam̐ dagilunnavi
nĕlagŏnna muribĕmu niluvuna nunnadi
yĕlami mīm̐daḍimām̐ṭa yemaneve yim̐kanu

(||nīva||)
siṟuda navvulu nīsĕlavulalo nunnavi
mĕṟayu sĕmaḍalu nīmena nunnavi
kaṟadala nerubulu kaḍagannula mannavi
yĕṟam̐gamu nīvubama lemaneve yim̐kanu

(||nīva||)
saṁdaḍiṁche siggulĕlla sanumŏnala nunnavi
kaṁduva tenĕlu movim̐ gappi vunnavi
yiṁduge vichchesi ninnu nelĕ śhrīveṁkaḍeśhum̐ḍu
yiṁdarivaṁṭivārame yemaneve yim̐kanu