నీ మాటలు నిన్నె మోచె నెలఁత పంతము చెల్లె
(॥పల్లవి॥)
నీ మాటలు నిన్నె మోచె నెలఁత పంతము చెల్లె
యేమనేవు మాతో నానతియ్యవయ్య యిపుడు
(॥నీమా॥)
వలచి యాపె నీమై వడిఁ జేఁతలు సేసితే
చెలితో మారుకుమారు సేసే నంటివి
సెలవి నవ్వులతోడ చేతులెత్తి మొక్కె నీకు
మలయుచు నీ వింక మారు మొక్కఁగలవా
(॥నీమా॥)
గుట్టుతో నాపె నిన్నుఁ గోరి తిట్టు దిట్టితేను
అట్టె మాటుమాట లాడే నంటివి
బెట్టి యెలుఁగెత్తి నిన్ను ప్రియము చెప్పిపొగడె
పొట్టఁ బొరుగున నాపెఁ బొగడఁగఁ గలవా
(॥నీమా॥)
ఇచ్చగించి యాపె నీకు యెంగిలిమోవి ఇచ్చితే
ఇచ్చినందుకును సరి ఇచ్చేనంటివి
కొచ్చి శ్రీవేంకటేశుఁడ కూడి మడిచి యాకిచ్చె
నిచ్చలు నిట్టె యాపెకు నీవూ నియ్యఁగలవా
(||pallavi||)
nī māḍalu ninnĕ mosĕ nĕlam̐ta paṁtamu sĕllĕ
yemanevu mādo nānadiyyavayya yibuḍu
(||nīmā||)
valasi yābĕ nīmai vaḍim̐ jem̐talu seside
sĕlido mārugumāru sese naṁṭivi
sĕlavi navvuladoḍa sedulĕtti mŏkkĕ nīgu
malayusu nī viṁka māru mŏkkam̐galavā
(||nīmā||)
guṭṭudo nābĕ ninnum̐ gori tiṭṭu diṭṭidenu
aṭṭĕ māḍumāḍa lāḍe naṁṭivi
bĕṭṭi yĕlum̐gĕtti ninnu priyamu sĕppibŏgaḍĕ
pŏṭṭam̐ bŏruguna nābĕm̐ bŏgaḍam̐gam̐ galavā
(||nīmā||)
ichchagiṁchi yābĕ nīgu yĕṁgilimovi ichchide
ichchinaṁdugunu sari ichchenaṁṭivi
kŏchchi śhrīveṁkaḍeśhum̐ḍa kūḍi maḍisi yāgichchĕ
nichchalu niṭṭĕ yābĕgu nīvū niyyam̐galavā