Nee kolamdivaaramaa nemellaanu

నీ కొలఁదివారమా నేమెల్లాను
Language

(॥పల్లవి॥)
నీ కొలఁదివారమా నేమెల్లాను
చేకొని పంతాలు మీతోఁ జెప్పుకోముగాక

(॥నీకొ॥)
చుట్టమైన పతితోడ సొలతుము కాంతలము
గుట్టుతోనే జంకించి కొసరుదుము
అట్టె నీవంతటిలోనే యాతని దవులనంటా
బట్టబయలు నీవెంత పట్టిపెనఁగేవే

(॥నీకొ॥)
చనవుగ మగని సాదింతు మిల్లాండ్లము
నునుపునఁ గొనగోరు నాటింతుము
పనివడి నీవే కడు బత్తిగలదాననంటా
పొనుఁగ కాతని కెంత పూనుక వచ్చేవే

(॥నీకొ॥)
యేలిన శ్రీవేంకటేశు నెనతుము సతులము
కాలు దొక్కి రతులనుఁ గరఁగింతుము
మేలమాడి యాతనితో మేలుదాన నైతినంటా
చాలా నీవాతని కెంత చాయలు దిద్దేవే

(||pallavi||)
nī kŏlam̐divāramā nemĕllānu
segŏni paṁtālu mīdom̐ jĕppugomugāga

(||nīgŏ||)
suṭṭamaina padidoḍa sŏladumu kāṁtalamu
guṭṭudone jaṁkiṁchi kŏsarudumu
aṭṭĕ nīvaṁtaḍilone yādani davulanaṁṭā
baṭṭabayalu nīvĕṁta paṭṭibĕnam̐geve

(||nīgŏ||)
sanavuga magani sādiṁtu millāṁḍlamu
nunubunam̐ gŏnagoru nāḍiṁtumu
panivaḍi nīve kaḍu battigaladānanaṁṭā
pŏnum̐ga kādani kĕṁta pūnuga vachcheve

(||nīgŏ||)
yelina śhrīveṁkaḍeśhu nĕnadumu sadulamu
kālu dŏkki radulanum̐ garam̐giṁtumu
melamāḍi yādanido meludāna naidinaṁṭā
sālā nīvādani kĕṁta sāyalu diddeve