Nee kolamdi vaaralaa yee nelamtalellaa

నీ కొలఁది వారలా యీ నెలఁతలెల్లా
Language

(॥పల్లవి॥)
నీ కొలఁది వారలా యీ నెలఁతలెల్లా
నీకు నిదె చాలుగాదా నిమ్మలాన నుండవే

(॥నీకొ॥)
యేల నివ్వెర గందేవే ఇంతులనెల్లాఁ జూచి
అలరీఁ డీతని కెంద రాండ్లంటాను
జాలిఁబడ నేమిటికి సవతులతో నెల్లా
నాలిసేయ కాతఁడు నవ్వీనంటాను

(॥నీకొ॥)
యేమిటికి యేఁకరేవే యెవ్వరైనా నీతనితో
ఆముకొని సరసము లాడేరంటాను
మోము శిర సేలూఁచేవే మునుకొని దేవుళ్ళకు
వోముక యీతఁడు విడే లొసఁగీనంటాను

(॥నీకొ॥)
అదేల ముక్కుపై వేలంటుకొనేవే ఇందరు
ఇదె యీతనిపొత్తున నెనసేరంటా
అదన శ్రీవేంకటేశుఁ డాతఁడే నన్ను నేలె
పదరకువే యీతఁడు పచ్చిదేరీ నంటాను

(||pallavi||)
nī kŏlam̐di vāralā yī nĕlam̐talĕllā
nīgu nidĕ sālugādā nimmalāna nuṁḍave

(||nīgŏ||)
yela nivvĕra gaṁdeve iṁtulanĕllām̐ jūsi
alarīm̐ ḍīdani kĕṁda rāṁḍlaṁṭānu
jālim̐baḍa nemiḍigi savadulado nĕllā
nāliseya kādam̐ḍu navvīnaṁṭānu

(||nīgŏ||)
yemiḍigi yem̐kareve yĕvvarainā nīdanido
āmugŏni sarasamu lāḍeraṁṭānu
momu śhira selūm̐seve munugŏni devuḽḽagu
vomuga yīdam̐ḍu viḍe lŏsam̐gīnaṁṭānu

(||nīgŏ||)
adela mukkubai velaṁṭugŏneve iṁdaru
idĕ yīdanibŏttuna nĕnaseraṁṭā
adana śhrīveṁkaḍeśhum̐ ḍādam̐ḍe nannu nelĕ
padaraguve yīdam̐ḍu pachchiderī naṁṭānu