Nee kogaraina nerami nerubule yaumgaani

నీ కొకరైన నేరమి నేరుపులే యౌఁగాని
Language

(॥పల్లవి॥)
నీ కొకరైన నేరమి నేరుపులే యౌఁగాని
జోకతోడ నౌఁగా దని సోదించఁ జెల్లదూ

(॥॥)
నిన్నుఁ బాసి వుండలేక నే నెంత దూరినాను
పన్ని నీకు నది యెగ్గుపట్ట మరి చెల్లదు
కన్నుల కాంక్షల నెంత కాఁడివారఁ జూచినాను
అన్నిటా దిష్టి దాఁకె నని యెంచఁ జెల్లదు

(॥॥)
ఆసతో నుంటవింట నిన్నట్టే కప్రాన వేసినా
వాసితో నొచ్చిన నొవ్వివడే నెంచఁ జెల్లదు
సేసలు వెట్టే వేళ చేత నెంత పెనఁగినా
బేసబెల్లి పంతాల బీర మాడఁ జెల్లదూ

(॥॥)
కామించి గుబ్బలు దాఁక కౌఁగి లెంత బిగించినా
కోమలపు మే నొత్తిన కుమ్మె లెంచఁజెల్లదూ
ప్రేమ తోడ మోవి యెంత పేర్చినా శ్రీ వేంకటేశ
ఆముకొని అది యెంగి లాయ ననఁ జెల్లదూ

(||pallavi||)
nī kŏgaraina nerami nerubule yaum̐gāni
jogadoḍa naum̐gā dani sodiṁcham̐ jĕlladū

(||||)
ninnum̐ bāsi vuṁḍalega ne nĕṁta dūrinānu
panni nīgu nadi yĕggubaṭṭa mari sĕlladu
kannula kāṁkṣhala nĕṁta kām̐ḍivāram̐ jūsinānu
anniḍā diṣhṭi dām̐kĕ nani yĕṁcham̐ jĕlladu

(||||)
āsado nuṁṭaviṁṭa ninnaṭṭe kaprāna vesinā
vāsido nŏchchina nŏvvivaḍe nĕṁcham̐ jĕlladu
sesalu vĕṭṭe veḽa seda nĕṁta pĕnam̐ginā
besabĕlli paṁtāla bīra māḍam̐ jĕlladū

(||||)
kāmiṁchi gubbalu dām̐ka kaum̐gi lĕṁta bigiṁchinā
komalabu me nŏttina kummĕ lĕṁcham̐jĕlladū
prema toḍa movi yĕṁta persinā śhrī veṁkaḍeśha
āmugŏni adi yĕṁgi lāya nanam̐ jĕlladū