Nee kidavai vumdamgaanu nenu navvudum gaaga

నీ కితవై వుండఁగాను నేను నవ్వుదుఁ గాక
Language

(॥పల్లవి॥)
నీ కితవై వుండఁగాను నేను నవ్వుదుఁ గాక
కాకు సేసి యిందరిలోఁ గాదనఁగ నేలా

(॥నీకిత॥)
చనవుగలాపె నీతో సరసము లాడఁగాను
నినుఁ జూచి మాకేల నేర మెంచను
వినయముతో నప్పటి వెస నీకొప్పు దువ్వఁగా
చెనకి యడ్డాలు వచ్చి చేరి మాన్పనేలా

(॥నీకిత॥)
కడుఁ బనిగలయాపె కదిపి పాదా లోత్తఁగా
విడిపించి మాకేల వెంగెములాడ
తొడఁ దొడా మోవ సందునఁ దానుఁగూచుండఁగా
వడిసీఁ జెమటలంటా వద్దన నాకేలా

(॥నీకిత॥)
బత్తిగలయాపె నీకు బాగా లొసఁగఁగాను
యెత్తి యందులో నౌఁగాము లెంచ మాకేల
హత్తితి శ్రీవేంకటేశ అలమేల్మంగను నేను
చిత్తగించి కూడితి వాచెలి నాడ నేలా

(||pallavi||)
nī kidavai vuṁḍam̐gānu nenu navvudum̐ gāga
kāgu sesi yiṁdarilom̐ gādanam̐ga nelā

(||nīgida||)
sanavugalābĕ nīdo sarasamu lāḍam̐gānu
ninum̐ jūsi māgela nera mĕṁchanu
vinayamudo nappaḍi vĕsa nīgŏppu duvvam̐gā
sĕnagi yaḍḍālu vachchi seri mānpanelā

(||nīgida||)
kaḍum̐ banigalayābĕ kadibi pādā lottam̐gā
viḍibiṁchi māgela vĕṁgĕmulāḍa
tŏḍam̐ dŏḍā mova saṁdunam̐ dānum̐gūsuṁḍam̐gā
vaḍisīm̐ jĕmaḍalaṁṭā vaddana nāgelā

(||nīgida||)
battigalayābĕ nīgu bāgā lŏsam̐gam̐gānu
yĕtti yaṁdulo naum̐gāmu lĕṁcha māgela
hattidi śhrīveṁkaḍeśha alamelmaṁganu nenu
sittagiṁchi kūḍidi vāsĕli nāḍa nelā