నీ కెట్టు దెలుసును యీ నెలఁత లెరుఁగుదురు
(॥పల్లవి॥)
నీ కెట్టు దెలుసును యీ నెలఁత లెరుఁగుదురు
సాకిరి వీరు చెప్పఁగా సమ్మతౌట గాక
(॥నీకె॥)
ఇక్కువ లంటేటివేళ ఇద్దరము నిద్దరమె
యెక్కువ తక్కువ లెంచ నిఁకనేల
లక్కవలె గరఁగిలాగులునుఁ-బాగులను
చొక్కివున్న విధములు చూచుకొంటగాక
(॥నీకె॥)
చనవు మెరనేవేళ సంగడీలము మనము
మనసులు సోదించ మఱియేల
పెనఁగేటి యాసలును ప్రియముల వాసులును
యెనఁసేటి తమకాలే యెంచుకొంటగాక
(॥నీకె॥)
తతిఁ గూడేయీవేళ దంటలమే యిద్దరము
కతులు చెప్పఁగ నిఁక కడమలేల
రతిలోఁ జొక్కితి మిదె రమణ శ్రీవేంకటేశ
మితిమీరినందు కెల్లా మెచ్చు టింతేకాక
(||pallavi||)
nī kĕṭṭu dĕlusunu yī nĕlam̐ta lĕrum̐guduru
sāgiri vīru sĕppam̐gā sammadauḍa gāga
(||nīgĕ||)
ikkuva laṁṭeḍiveḽa iddaramu niddaramĕ
yĕkkuva takkuva lĕṁcha nim̐kanela
lakkavalĕ garam̐gilāgulunum̐-bāgulanu
sŏkkivunna vidhamulu sūsugŏṁṭagāga
(||nīgĕ||)
sanavu mĕraneveḽa saṁgaḍīlamu manamu
manasulu sodiṁcha maṟiyela
pĕnam̐geḍi yāsalunu priyamula vāsulunu
yĕnam̐seḍi tamagāle yĕṁchugŏṁṭagāga
(||nīgĕ||)
tadim̐ gūḍeyīveḽa daṁṭalame yiddaramu
kadulu sĕppam̐ga nim̐ka kaḍamalela
radilom̐ jŏkkidi midĕ ramaṇa śhrīveṁkaḍeśha
midimīrinaṁdu kĕllā mĕchchu ṭiṁtegāga