నీ కెంత యితవో నెలఁత సేసే చేఁత
(॥పల్లవి॥)
నీ కెంత యితవో నెలఁత సేసే చేఁత
కాకు సేసేవారి నెరఁగదు సిగ్గువడదు
(॥నీకెం॥)
వనిత లిందరుఁ దలవంచు కుండఁగా నీకె
చనవరితనమున సాదించీ నిన్ను
గొనకొని యప్పటిని కొలువులోపల నెల్లా
ననుపుల సంగాతాన నవ్వీ నీతోను
(॥నీకెం॥)
వెల్లవిరై గద్దెమీఁద వెస నీవుండఁగా నాపె
చెల్లుబడితనమునఁ జెనకీ నిన్ను
పల్లదపురాజసానఁ బంతములో నీవుండఁగా
మెల్లనె మందెమేళాలు మెరసీ నీయెదుట
(॥నీకెం॥)
కూరిమిఁ గాఁగిట నీవు కూడేటి వేళ యాపె
గారాపుతనమునఁ గలసీ నిన్ను
యీరీతి శ్రీవేంకటేశ యేలితివి మమ్ము నిట్టె
నేరుపరియై కడునిక్కి చూచీ నిదివో
(||pallavi||)
nī kĕṁta yidavo nĕlam̐ta sese sem̐ta
kāgu sesevāri nĕram̐gadu sigguvaḍadu
(||nīgĕṁ||)
vanida liṁdarum̐ dalavaṁchu kuṁḍam̐gā nīgĕ
sanavaridanamuna sādiṁchī ninnu
gŏnagŏni yappaḍini kŏluvulobala nĕllā
nanubula saṁgādāna navvī nīdonu
(||nīgĕṁ||)
vĕllavirai gaddĕmīm̐da vĕsa nīvuṁḍam̐gā nābĕ
sĕllubaḍidanamunam̐ jĕnagī ninnu
palladaburājasānam̐ baṁtamulo nīvuṁḍam̐gā
mĕllanĕ maṁdĕmeḽālu mĕrasī nīyĕduḍa
(||nīgĕṁ||)
kūrimim̐ gām̐giḍa nīvu kūḍeḍi veḽa yābĕ
gārābudanamunam̐ galasī ninnu
yīrīdi śhrīveṁkaḍeśha yelidivi mammu niṭṭĕ
nerubariyai kaḍunikki sūsī nidivo