నీ కెంత వేడుకోకాని నిండిన కొలువులోన
(॥పల్లవి॥)
నీ కెంత వేడుకోకాని నిండిన కొలువులోన
యీ కడఁ జూచినవారి కెల్లిదమై తోఁచును
(॥నీ కెంత॥)
వులివచ్చి నవ్వులతో నోరి యని పిలిచీని
అలివేణి వావి నీ కేమౌనోకాని
చెలరేఁగి రమ్మనుచు చేయివట్టి తీసీని
సులభాన నెటువంటి చుట్టమోకాని
(॥నీ కెంత॥)
యిక్కువలంటి నీతోనే యేకాంతము లాడీని
మిక్కిలి నీకెంత నమ్మినదోకాని
పక్కనే నీ కుడిబడి పనులెల్లాఁ జెప్పీని
గక్కక నిన్నెంత యేలుకొన్నదోకాని
(॥నీ కెంత॥)
మన్ననతో నలమేలుమంగవతె నురమెక్కీ
తిన్నఁగా నెంత పట్టపుదేవులోకాని
అన్నిటా శ్రీవేంకటేశ యిటు నన్ను నేలితివి
తన్ను నేలుమనీ నెట్టి తుగలుదోకాని
(||pallavi||)
nī kĕṁta veḍugogāni niṁḍina kŏluvulona
yī kaḍam̐ jūsinavāri kĕllidamai tom̐sunu
(||nī kĕṁta||)
vulivachchi navvulado nori yani pilisīni
aliveṇi vāvi nī kemaunogāni
sĕlarem̐gi rammanusu seyivaṭṭi tīsīni
sulabhāna nĕḍuvaṁṭi suṭṭamogāni
(||nī kĕṁta||)
yikkuvalaṁṭi nīdone yegāṁtamu lāḍīni
mikkili nīgĕṁta namminadogāni
pakkane nī kuḍibaḍi panulĕllām̐ jĕppīni
gakkaga ninnĕṁta yelugŏnnadogāni
(||nī kĕṁta||)
mannanado nalamelumaṁgavadĕ nuramĕkkī
tinnam̐gā nĕṁta paṭṭabudevulogāni
anniḍā śhrīveṁkaḍeśha yiḍu nannu nelidivi
tannu nelumanī nĕṭṭi tugaludogāni