నీ కేమి దూరుదాన నే నైఁతి గాక
(॥పల్లవి॥)
నీ కేమి దూరుదాన నే నైఁతి గాక
వాకున నప్పుడే నీతో వద్దననా
(॥కేమి॥)
నా మోము చూచి నీవే నవ్వఁగా నవ్వితిఁ గాక
ఆమాట లెల్లా నాపెతో నాడుదురా
ప్రేమాన నా పంపఁగా నే పిలువ వచ్చితి నింతే
చే ముట్టిన యాసుద్ది చెప్పుదురా
(॥నీ కేమి॥)
రమ్మని చేయి వట్టఁగ రతి నూర కుంటిఁగాక
యెమ్మె కెల్లా నాపెతోడ నెంచుకొందురా
వుమ్మడి నాపెకు నీకు నూడిగపుదాన నింతే
అమ్మరో నావుంగరము ఆపె కిత్తురా
(॥నీ కేమి॥)
పాదాలు గుద్దు మనఁగా పైకొన గుద్దితిఁ గాక
పోదిగా నాసుద్ది యీడఁ బొగడుదురా
యీదెస నాపెఁ గూడితి విట్టె శ్రీవెంకటేశ
సోదించి నా మో వాపెకుఁ జూప వచ్చునా
(||pallavi||)
nī kemi dūrudāna ne naim̐ti gāga
vāguna nappuḍe nīdo vaddananā
(||kemi||)
nā momu sūsi nīve navvam̐gā navvidim̐ gāga
āmāḍa lĕllā nābĕdo nāḍudurā
premāna nā paṁpam̐gā ne piluva vachchidi niṁte
se muṭṭina yāsuddi sĕppudurā
(||nī kemi||)
rammani seyi vaṭṭam̐ga radi nūra kuṁṭim̐gāga
yĕmmĕ kĕllā nābĕdoḍa nĕṁchugŏṁdurā
vummaḍi nābĕgu nīgu nūḍigabudāna niṁte
ammaro nāvuṁgaramu ābĕ kitturā
(||nī kemi||)
pādālu guddu manam̐gā paigŏna guddidim̐ gāga
podigā nāsuddi yīḍam̐ bŏgaḍudurā
yīdĕsa nābĕm̐ gūḍidi viṭṭĕ śhrīvĕṁkaḍeśha
sodiṁchi nā mo vābĕgum̐ jūba vachchunā