Nee kela bhayamu neegu neege aligevu

నీ కేల భయము నీకు నీకే అలికేవు
Language

(॥పల్లవి॥)
నీ కేల భయము నీకు నీకే అలికేవు
చేకొన్న నీచేఁతలందుఁ జెరిగున్నవా

(॥నీకే॥)
చనవుసేసుక ఆపె సారె నీమోము చూచితే
చెనకఁ జాలక యేల సిగ్గువడేవు
కనుఁగొనఁబోతే నందు కళ లింతే వుండీ నవి
వెనుకొని కాంతలెల్లా వేలు కాడేరా

(॥నీకే॥)
మచ్చికచేసుక ఆపె మాటలు నిన్నడించితే
కొచ్చి కొచ్చి నీవేల కొంకంజూచేవు
కచ్చుపెట్టి తోఁచేవి కల్లనిజములేకాక
అచ్చమై పొందినసతు లంటుకున్నారా

(॥నీకే ॥)
చుట్టము సేసుక యింతి సొరిది నిన్నుఁ గూడితే
యిట్టె శ్రీ వేంకటశ నీవేల మొక్కేవు
గుట్టునను కొనగోళ్ల గురుతు లుండీఁగాక
ముట్టిన కాంతలు మేన మూఁగుకున్నారా

(||pallavi||)
nī kela bhayamu nīgu nīge aligevu
segŏnna nīsem̐talaṁdum̐ jĕrigunnavā

(||nīge||)
sanavusesuga ābĕ sārĕ nīmomu sūside
sĕnagam̐ jālaga yela sigguvaḍevu
kanum̐gŏnam̐bode naṁdu kaḽa liṁte vuṁḍī navi
vĕnugŏni kāṁtalĕllā velu kāḍerā

(||nīge||)
machchigasesuga ābĕ māḍalu ninnaḍiṁchide
kŏchchi kŏchchi nīvela kŏṁkaṁjūsevu
kachchubĕṭṭi tom̐sevi kallanijamulegāga
achchamai pŏṁdinasadu laṁṭugunnārā

(||nīge ||)
suṭṭamu sesuga yiṁti sŏridi ninnum̐ gūḍide
yiṭṭĕ śhrī veṁkaḍaśha nīvela mŏkkevu
guṭṭunanu kŏnagoḽla gurudu luṁḍīm̐gāga
muṭṭina kāṁtalu mena mūm̐gugunnārā