Nee keduru soosi soosi nelamta nannampe nide

నీ కెదురు చూచి చూచి నెలఁత నన్నంపె నిదే
Language

(॥పల్లవి॥)
నీ కెదురు చూచి చూచి నెలఁత నన్నంపె నిదే
రాకుండితే నాపె వచ్చీ రావయ్య నీవూ

(॥నీ కెదురు॥)
అప్పుడు నీ వాన వెట్టినది నమ్మినది గాక
తప్పులు వట్ట నేర దాతరుణి నిన్ను
నెప్పున నీ విందుకుఁ గా నీవేల వెరచి రావు
చెప్పేఁ గాని యింటికి విచ్చేయవయ్యా నేఁడు

(॥నీ కెదురు॥)
నీసుద్దుల కెల్ల నాపె నెట్టన నోరిచెఁ గాక
సేసే నంటే నీ వింతిచేఁతకు వేలె
పాసి యిందుకుఁ గా సిగ్గుపడి యీడఁ గొంక నేల
సేసతో మాయింటికి విచ్చేయవయ్య ఘనుఁడా

(॥నీ కెదురు॥)
ముంచి యలమేలుమంగ మొకమోడి కూడెఁ గాక
వంచే నంటే నాపె నీతో వాదు వెట్టదా
యెంచుక శ్రీవెంకటేశ యిందుకుఁ గా నవ్వ వేల
చించితి మాట యింకా విచ్చేయవయ్య యింటికి

(||pallavi||)
nī kĕduru sūsi sūsi nĕlam̐ta nannaṁpĕ nide
rāguṁḍide nābĕ vachchī rāvayya nīvū

(||nī kĕduru||)
appuḍu nī vāna vĕṭṭinadi namminadi gāga
tappulu vaṭṭa nera dādaruṇi ninnu
nĕppuna nī viṁdugum̐ gā nīvela vĕrasi rāvu
sĕppem̐ gāni yiṁṭigi vichcheyavayyā nem̐ḍu

(||nī kĕduru||)
nīsuddula kĕlla nābĕ nĕṭṭana norisĕm̐ gāga
sese naṁṭe nī viṁtisem̐tagu velĕ
pāsi yiṁdugum̐ gā siggubaḍi yīḍam̐ gŏṁka nela
sesado māyiṁṭigi vichcheyavayya ghanum̐ḍā

(||nī kĕduru||)
muṁchi yalamelumaṁga mŏgamoḍi kūḍĕm̐ gāga
vaṁche naṁṭe nābĕ nīdo vādu vĕṭṭadā
yĕṁchuga śhrīvĕṁkaḍeśha yiṁdugum̐ gā navva vela
siṁchidi māḍa yiṁkā vichcheyavayya yiṁṭigi