నీ కథామృతము నా నిరతసేవన నాకు
(॥పల్లవి॥)
నీ కథామృతము నా నిరతసేవన నాకు
చేకొనుట సకలసుఖసేవనంబటు గాన
(॥నీక॥)
ఇదియె మంత్రరాజము నాకు నేప్రొద్దు
నిదియె వేదసంహిత పాఠము
ఇదియె బహుశాస్త్రమెల్లఁ జదువుట నాకు
ఇదియె సంధ్య నాకిదియె జపమటు గాన
(॥నీక॥)
ఇదియె బ్రహ్మవిద్యోపదేశము నాకు
ఇదియె దుఃఖవిరహితమార్గము
ఇదియె బహులోకహితభేషజము నాకు
ఇదియె వుపనిషద్వాక్యపద్ధతిగాన
(॥నీక॥)
ఇదియె దానఫలమియ్యఁ జాలును నాకు
ఇదియె తపవిరహిత కర్మము
ఇదియె తిరువేంకటేశ్వరుని సంస్మరణ
ఇదియె యిదియె యిన్నియును నటుగాన
(||pallavi||)
nī kathāmṛtamu nā niradasevana nāgu
segŏnuḍa sagalasukhasevanaṁbaḍu gāna
(||nīga||)
idiyĕ maṁtrarājamu nāgu neprŏddu
nidiyĕ vedasaṁhida pāṭhamu
idiyĕ bahuśhāstramĕllam̐ jaduvuḍa nāgu
idiyĕ saṁdhya nāgidiyĕ jabamaḍu gāna
(||nīga||)
idiyĕ brahmavidyobadeśhamu nāgu
idiyĕ duḥkhavirahidamārgamu
idiyĕ bahulogahidabheṣhajamu nāgu
idiyĕ vubaniṣhadvākyabaddhadigāna
(||nīga||)
idiyĕ dānaphalamiyyam̐ jālunu nāgu
idiyĕ tabavirahida karmamu
idiyĕ tiruveṁkaḍeśhvaruni saṁsmaraṇa
idiyĕ yidiyĕ yinniyunu naḍugāna