Nee kaabe gaavale nomde nene kaavalem gaaga

నీ కాపె గావలె నొండె నేనే కావలెఁ గాక
Language

(॥పల్లవి॥)
నీ కాపె గావలె నొండె నేనే కావలెఁ గాక
చేకొని యిద్దరు నైతే సిగ్గులెల్లా రేఁగవా

(॥నీకాప॥)
చనవరివలె నాపె సంగడిఁ గూచుండఁగాను
ననుపున నాతో నేల నవ్వ వచ్చేవు
వొనర దా నప్పటిని వొడివట్టుకుండఁగాను
చెనకుతా నాపై నేల చెయి చాఁచేవు

(॥నీకాప॥)
వదినెవలెనే చేర వచ్చి సరస మాడఁగా
కదిసి నీవు న న్నేల కాలు దొక్కేవు
అదిమి నిన్నుఁ గౌఁగిట నట్టేకౌఁగిలించుకుండఁగాను
పెదవితేనెకు నేల సెనగేవుఁనీవు

(॥నీకాప॥)
బత్తిగలదానివలె బాగాలు నీ కియ్యఁగాను
పొత్తుల నాతో నేల పొందు సేసేవు
తత్తరానఁ దెరలోన దాయక తా నుండఁగాను
యిత్తల శ్రీవేంకటేశ యెట్టు న న్నేలితివి

(||pallavi||)
nī kābĕ gāvalĕ nŏṁḍĕ nene kāvalĕm̐ gāga
segŏni yiddaru naide siggulĕllā rem̐gavā

(||nīgāba||)
sanavarivalĕ nābĕ saṁgaḍim̐ gūsuṁḍam̐gānu
nanubuna nādo nela navva vachchevu
vŏnara dā nappaḍini vŏḍivaṭṭuguṁḍam̐gānu
sĕnagudā nābai nela sĕyi sām̐sevu

(||nīgāba||)
vadinĕvalĕne sera vachchi sarasa māḍam̐gā
kadisi nīvu na nnela kālu dŏkkevu
adimi ninnum̐ gaum̐giḍa naṭṭegaum̐giliṁchuguṁḍam̐gānu
pĕdavidenĕgu nela sĕnagevum̐nīvu

(||nīgāba||)
battigaladānivalĕ bāgālu nī kiyyam̐gānu
pŏttula nādo nela pŏṁdu sesevu
tattarānam̐ dĕralona dāyaga tā nuṁḍam̐gānu
yittala śhrīveṁkaḍeśha yĕṭṭu na nnelidivi