Nee jaanadanamulu ne meramgamaa

నీ జాణతనములు నే మెరఁగమా
Language

(॥పల్లవి॥)
నీ జాణతనములు నే మెరఁగమా
రాజనంటా యేల మము రవ్వ సేసేవు

(॥నీజా॥)
చేరఁడేసికన్నులతో చేరి నిన్నుఁ జూడఁగాను
దార దప్పనంటా నేల తప్పు వట్టేవు
బారెఁడు నెరులతో నీపాదాలకు మొక్కఁగాను
కోరి మమ్ము నేల నీవు కొంగువట్టేవు

(॥నీజా॥)
జుట్టేఁడేసిపాదాల నీచోటికి యెదురు రాఁగా
యిట్టివే తామరలంటా నేల పోల్చెవు
పట్టెఁ డేసికుచముల బలిమి నిన్నానుకొంటే
కొట్టగొన వాండ్లంటా గొర సేసేవు

(॥నీజా॥)
వేలిఁడేసిగోళ్లతో వెసఁ గొప్పు నే దువ్వితే
నాలితో భ్రమసి యాల నవ్వు నవ్వేవు
యీ లీల శ్రీ వేంకటేశ యిట్టే నన్నుఁ గూడితివి
మే లనుచు మమ్ము నేల మెచ్చ వచ్చేవు

(||pallavi||)
nī jāṇadanamulu ne mĕram̐gamā
rājanaṁṭā yela mamu ravva sesevu

(||nījā||)
seram̐ḍesigannulado seri ninnum̐ jūḍam̐gānu
dāra dappanaṁṭā nela tappu vaṭṭevu
bārĕm̐ḍu nĕrulado nībādālagu mŏkkam̐gānu
kori mammu nela nīvu kŏṁguvaṭṭevu

(||nījā||)
juṭṭem̐ḍesibādāla nīsoḍigi yĕduru rām̐gā
yiṭṭive tāmaralaṁṭā nela polsĕvu
paṭṭĕm̐ ḍesigusamula balimi ninnānugŏṁṭe
kŏṭṭagŏna vāṁḍlaṁṭā gŏra sesevu

(||nījā||)
velim̐ḍesigoḽlado vĕsam̐ gŏppu ne duvvide
nālido bhramasi yāla navvu navvevu
yī līla śhrī veṁkaḍeśha yiṭṭe nannum̐ gūḍidivi
me lanusu mammu nela mĕchcha vachchevu