నీ జాడలెల్లాఁ దొల్లే నే నెరఁగనా
(॥పల్లవి॥)
నీ జాడలెల్లాఁ దొల్లే నే నెరఁగనా
వోజతో నీ సుద్దులెల్లా వొప్పుగొనేఁగాక
(॥నీజా॥)
మొనసి వొకరిమీఁద మోహమున్నదా నీకు
మనసు చూడవలసి మాటలాడేవు
చెనకి ఇంతలోననే చెల్లునా మందెమేళము
వొసర నేమనినాను వూఁకొనేఁగాక
(॥నీజా॥)
సమ్మతించి ఇంతులను సరకుగొనేవా నీవు
నమ్మికల కూరకైనా నవ్వు నవ్వేవు
పమ్మి ఇంతటిలోననే బలిమి చూపవచ్చునా
ఇమ్ముల నీకతలెల్లా నియ్యకొనేఁగాక
(॥నీజా॥)
అందపు గాంతలు నీకు నబ్బురమా యేమైనా
కందువల నన్ను నిట్టె కాఁగిలించేవు
అందుకు నింతలోననే ఆడేనా శ్రీ వేంకటేశ
సందడిలో నీకూటమి సంతోసించేఁ గాక
(||pallavi||)
nī jāḍalĕllām̐ dŏlle ne nĕram̐ganā
vojado nī suddulĕllā vŏppugŏnem̐gāga
(||nījā||)
mŏnasi vŏgarimīm̐da mohamunnadā nīgu
manasu sūḍavalasi māḍalāḍevu
sĕnagi iṁtalonane sĕllunā maṁdĕmeḽamu
vŏsara nemaninānu vūm̐kŏnem̐gāga
(||nījā||)
sammadiṁchi iṁtulanu saragugŏnevā nīvu
nammigala kūragainā navvu navvevu
pammi iṁtaḍilonane balimi sūbavachchunā
immula nīgadalĕllā niyyagŏnem̐gāga
(||nījā||)
aṁdabu gāṁtalu nīgu nabburamā yemainā
kaṁduvala nannu niṭṭĕ kām̐giliṁchevu
aṁdugu niṁtalonane āḍenā śhrī veṁkaḍeśha
saṁdaḍilo nīgūḍami saṁtosiṁchem̐ gāga