నీ జాడ లన్నియు నే నెఱఁగనా । నీవు
(॥పల్లవి॥)
నీ జాడ లన్నియు నే నెఱఁగనా । నీవు
వోజలు రెండుచోట్లా నొనరించే విపుడు
(॥నీజా॥)
కాయకపు నవ్వులకు కడుఁ జల్లేవు మామీఁద
ఆయమైనమనసు నీకాపెమీఁదనే
చాయలు సన్నలు నిందు సారెసారెఁ జూపేది
చేయిమీఁదుగా నాకెఁ జేసేటిచేఁతలు
(॥నీజా॥)
ఇచ్చకపుమాటలను యెలఇంచేవు మమ్ము
నిచ్చళవుసరసము నెరపే వందు
లచ్చనలకొనగోరు లలి మోపేవు మామీఁద
ముచ్చటఁ గాఁగిలినిండా ముంచియెత్తే వాపెను
(॥నీజా॥)
పోరచికూటములఁ బొందితివి మమ్మును
నేరుపులరతులెల్లా నించితి వాడ
యీరీతి శ్రీవేంకటాద్రి నీటు గోవిందరాజవై
కూరిమి రెంటాఁ బెంచి కొసర నందేఁటికి
(||pallavi||)
nī jāḍa lanniyu ne nĕṟam̐ganā | nīvu
vojalu rĕṁḍusoṭlā nŏnariṁche vibuḍu
(||nījā||)
kāyagabu navvulagu kaḍum̐ jallevu māmīm̐da
āyamainamanasu nīgābĕmīm̐dane
sāyalu sannalu niṁdu sārĕsārĕm̐ jūbedi
seyimīm̐dugā nāgĕm̐ jeseḍisem̐talu
(||nījā||)
ichchagabumāḍalanu yĕla̮iṁchevu mammu
nichchaḽavusarasamu nĕrabe vaṁdu
lachchanalagŏnagoru lali mobevu māmīm̐da
muchchaḍam̐ gām̐giliniṁḍā muṁchiyĕtte vābĕnu
(||nījā||)
porasigūḍamulam̐ bŏṁdidivi mammunu
nerubularadulĕllā niṁchidi vāḍa
yīrīdi śhrīveṁkaḍādri nīḍu goviṁdarājavai
kūrimi rĕṁṭām̐ bĕṁchi kŏsara naṁdem̐ṭigi