Nee guttu seṟusanela nemdu maagu

నీ గుట్టు చెఱుచనేల నేఁడు మాకు
Language

(॥పల్లవి॥)
నీ గుట్టు చెఱుచనేల నేఁడు మాకు
వేగిరించ కింకా నీవేడుకే యెఱుఁగు

(॥నీగు॥)
పంతము నీ వాడఁగాను పకపక నవ్వువచ్చె
నంతవాఁడ వౌదువయ్యా అందుకేమి
బంతినే యిందరిలోనాఁ బడితళించుముగాని
మంతనాన నీచేఁత నీమనసే యెఱుఁగు

(॥నీగు॥)
వట్టియాచారాలఁబోఁగా వడినాకు సిగ్గు వచ్చె
యెట్టైనా నీకు జెల్లు నేలయ్య
రట్టుసేయఁగాని నే నిట్టే; రచ్చలో నంత
మట్టులేనిమర్మాలు నీమనసే యెఱుఁగు

(॥నీగు॥)
తమకించి కూడఁగాను తారుకాణలెల్లా వచ్చె
సముకాన నంతవద్దు సటలేలయ్యా
అమరె శ్రీవేంకటేశ అట్టె మారుకు మారేల
మమకారము నాపై నీమనసే యెఱుఁ

(||pallavi||)
nī guṭṭu sĕṟusanela nem̐ḍu māgu
vegiriṁcha kiṁkā nīveḍuge yĕṟum̐gu

(||nīgu||)
paṁtamu nī vāḍam̐gānu pagabaga navvuvachchĕ
naṁtavām̐ḍa vauduvayyā aṁdugemi
baṁtine yiṁdarilonām̐ baḍidaḽiṁchumugāni
maṁtanāna nīsem̐ta nīmanase yĕṟum̐gu

(||nīgu||)
vaṭṭiyāsārālam̐bom̐gā vaḍināgu siggu vachchĕ
yĕṭṭainā nīgu jĕllu nelayya
raṭṭuseyam̐gāni ne niṭṭe; rachchalo naṁta
maṭṭulenimarmālu nīmanase yĕṟum̐gu

(||nīgu||)
tamagiṁchi kūḍam̐gānu tārugāṇalĕllā vachchĕ
samugāna naṁtavaddu saḍalelayyā
amarĕ śhrīveṁkaḍeśha aṭṭĕ mārugu mārela
mamagāramu nābai nīmanase yĕṟum̐